Smart TV: స్మార్ట్ టీవీని ఉచితంగా పొందాలనుకుంటున్నారా.. ఏం చేయాలంటే?

Smart TV: ప్రస్తుత కాలంలో మారుతున్న టెక్నాలజీ వల్ల ప్రజలు కూడా సరికొత్త టెక్నాలజీతో ఉన్న వస్తువులు ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో అధునాతన టెక్నాలజీతో రూపొందించిన స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించడానికి ఆసక్తి చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ టీవీలను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టివి ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

ఇటీవల ఇక టీవీ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 55 అంగుళాల స్మార్ట్ టీవీ, అది కూడా 4కే రిజల్యూషన్ ఉన్న టీవీ ఉచితంగా ఇచ్చేస్తుంది. అది కూడా 5 లక్షల మందికి ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
సాధారణంగా 55 అంగుళాల సైజు, 4కే రిజల్యూషన్ కలిగిన శాంసంగ్ స్మార్ట్ టీవీ ధర రూ. 2 లక్షల పైనే ఉంటుంది.అలాగే ఇదే ఫీచర్స్, డిస్ప్లే సైజుతో రూ. 30 వేలకు కూడా దొరుకుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఉచితంగా ఇవ్వలేదు.

 

కానీ ఒక టీవీ కంపెనీ మాత్రం ఉచితంగా రూ. 82 వేల రూపాయల స్మార్ట్ టీవీని ఉచితంగా ఇస్తుంది. అవునండి మీరు విన్నది నిజమే..టెలీ అనే టీవీ బ్రాండ్ 55 అంగుళాల స్క్రీన్, 4కే రిజల్యూషన్ తో వస్తుంది. డ్యూయల్ స్క్రీన్ దీని ప్రత్యేకత.డ్యూయల్ స్క్రీన్ కారణంగానే ఆ కంపెనీ ఉచితంగా టీవీని ఇస్తుంది.ప్లూటో టీవీ సహ వ్యవస్థాపకుడు ఇలియా పోజిన్ ఈ స్మార్ట్ టీవీని ఉచితంగా అందిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీలో రెండు స్క్రీన్లు వస్తాయి. మొదటిది పెద్దగా ఉంటుంది. రెండవది చిన్నగా ఉంటుంది.

 

పెద్ద స్క్రీన్ లో మనకి నచ్చిన కంటెంట్ చూడవచ్చు. రెండవ స్క్రీన్ మాత్రం కంపెనీకి చెందిన ప్రకటనలు వస్తుంటాయి. టీవీ చూసిన ప్రతిసారీ కింద స్క్రీన్ అనేది తప్పకుండా ఆన్ లోనే ఉంచాలి. స్మార్ట్ డిస్ప్లేగా పిలవబడే ఈ రెండవ స్క్రీన్ మెయిన్ టీవీ నుంచి సౌండ్ బార్ తో సెపరేట్ చేయబడి ఉంటుంది.ఈ స్క్రీన్ లో వాతావరణం, న్యూస్ టిక్కర్స్, క్రీడలకు సంబంధించిన స్కోర్లు, స్టాక్ మార్కెట్ రేట్లు వంటివి డిస్ప్లే అవుతుంటాయి. మొదటి 5 లక్షల మందికి మాత్రమే ఈ టీవీని ఉచితంగా ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇండియాలో ఇంకా ఈ ఉచిత స్మార్ట్ టీవీ కాన్సెప్ట్ ను ప్రారంభించలేదు. ప్రస్తుతం అమెరికా వారికి మాత్రమే అవకాశం ఇచ్చింది.అక్కడ విజయవంతమైతే మిగతా దేశాలకు ఈ బిజినెస్ మోడల్ ని విస్తరించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -