White Spots on Nails: మీ గోళ్లపై ఇలాంటి మచ్చలు ఉన్నాయా.. ఆ మచ్చల వల్ల ఎంత ప్రమాదమో తెలిస్తే షాకవ్వాల్సిందే!

White Spots on Nails: మామూలుగా స్త్రీలకు పురుషులకు గోళ్ల పై తెల్లటి మచ్చలు ఉండటం అన్నది సహజం. అయితే కొంతమంది అవి ఎందుకు వస్తాయి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొందరు అలా వచ్చినా కూడా పెద్దగా వాటి గురించి పట్టించుకోరు. కొందరికి గొర్లపై మచ్చలు కొంతకాలం పాటు అలాగే ఉండి ఆ తర్వాత మళ్ళీ వాటంతట అవే వెళ్లిపోతూ ఉంటాయి. నిజానికి చేతి గోళ్లపై కనిపించే ఈ తెల్లమచ్చలు మన శరీరంలో వివిధ వ్యాధుల ఉనికికి సంకేతాలను తెలుపుతాయట. కాబట్టి మీ వేళ్లపై కూడా ఈ విధమైన తెల్ల మచ్చలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. లేదంటే ప్రమాదం సంభవించవచ్చు.

ముఖ్చంగా ల్యుకోనిచియా వల్ల ఈ తెల్లమచ్చలు చేతి వేళ్ల గోళ్లపై కనిపిస్తాయి. అలాగే గోళ్లపై ఈ తెల్లమచ్చలు రావడం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగించినప్పుడు కూడా ఇలాంటి తెల్ల మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. నెయిల్‌ రిమూవర్‌లో కొన్ని హానికారక రసాయనాలు ఉంటాయి. ఇవి గోళ్లతో చర్య జరిపి గోళ్లకు హాని కలిగిస్తాయి. దీని వల్ల తెల్ల మచ్చలు ఏర్పడతాయి. ఒనికోమైకోసిస్ అనే ఫంగస్ గోరు ఉపరితలంపై సులభంగా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ప్రాథమిక లక్షణం గోళ్ళపై తెల్లటి మచ్చలు ఏర్పడటం. ఇది త్వరగా గోరుపై వ్యాపిస్తుంది. గోరు క్రమంగా పెళుసుగా మారుతుంది. చాలా సార్లు గాయాల వల్ల గోళ్ల ఉపరితలం దెబ్బతింటుంది.

ఫలితంగా గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. గోళ్లు పెరిగే కొద్దీ అవి కూడా క్రమంగా పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా చేతి వేళ్ల మూలల్లో, చేతికి దెబ్బతగలడం, డెస్క్‌లో పడి వేళ్లు నలిగిపోవడం వంటి మొదలైన వాటి వల్ల ఇలా చేతి వేళ్లకు గాయాలు సంభవిస్తాయి. తరచుగా మానిక్యూర్ చేయడం వల్ల కూడా అధిక ఒత్తిడి కారణంగా గోళ్ల సమస్యలు తలెత్తుతాయి. అధిక ఒత్తిడితో మానిక్యూర్‌ చేయించుకోవడం మానేయాలి. ఫలితంగా వేళ్ల గోళ్లపై ఒత్తిడి పడదు. అదేవిధంగా కొన్నిసార్లు మనం వినియోగించే మందుల వల్ల కూడా గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.. అలాగే శరీరంలో జింక్, కాల్షియం తగిన మోతాదులో లేకపోవడం వల్ల గోళ్లపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అందువల్ల సమతులాహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. అటువంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Raghu Rama Krishnam Raju: ఉండిపై ఉడుం పట్టు పట్టిన రఘురామ కృష్ణంరాజు.. అసెంబ్లీలో జగన్ కు వణుకేనా?

Raghu Rama Krishnam Raju: రఘురాం కృష్ణంరాజు కి కూటమి తరపున టికెట్ రాదు అనే భావించిన వైసీపీ వర్గం వారు సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అనూహ్యంగా తెదేపా...
- Advertisement -
- Advertisement -