Revanth Reddy: నీటి పంపకాల్లో 50 శాతం ఎందుకు అడగలేదు.. రేవంత్ లాజిక్ రైట్ అంటూ?

Revanth Reddy: ఏపీ తెలంగాణకు నీటి వివాదాలు ఈనాటివి కావు. దశాబ్ధాలుగా ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్టంగా అవతరించడానికి నీటి వివాదం కూడా ప్రధాన కారణమే. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కానీ.. వివాదాలు అలాగే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కంటే.. ఒకే రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి ఈ నీటి వివాదాలు కారణమవుతున్నాయి.

 

రీసెంట్‌గా కృష్ణాబోర్డు అధికారులతో తెలంగాణ క్యాబినెట్ సమావేశమైంది. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. నీటి సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి లొంగిపోయిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. మన జుట్టు తీసుకొని వెళ్లి కేంద్రం చేతిలో పెట్టారని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకంటే తెలివితక్కువ పని మరొకటి ఉండదని మండిపడ్డారు. అయితే.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ విమర్శలను ఖండించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చేసిన తప్పులను కవర్ చేయడానికి కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి చేయాల్సిన నష్టం చేసి ఆ పాపాలను కాంగ్రెస్ పై నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అంతేకాదు.. కేంద్రంతోనూ, ఏపీ ప్రభుత్వంతోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు లాలూచీ పడ్డారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతీ రోజు 8 టీఎంసీల నీటిని తరలించుకుపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ అని అన్నారు. గతంలో కేసీఆర్ ఇంటి సీఎం జగన్ వచ్చి 6 గంటలు చర్చించారని.. ఆ భేటీ సారాంశం ఇదేనని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దానికి సంబంధించిన జీవో 2020లో వచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ సీఎం గుర్తు చేశారు.

 

ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కేంద్రానికి లొంగిపోయిందని అన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి కేసీఆర్ సర్కార్ అంగీకరించిందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులుపై ఉన్న ప్రాజెక్టులపై ఉన్న వ్యవహారం కేంద్రానికి అప్పగించిందని విమర్శించారు. దీనికి సంబంధించి 2014 ఫిబ్రవరి 2న ఆమోదం జరిగిన సమయంలో కేసీఆర్ ఎంపీగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ ఒక్క విషయమే కాదు.. పునర్విభజన చట్టంలో ప్రతీ అక్షరం తన అంగీకారంతోనే జరిగిందని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలను సీఎం కోడ్ చేశారు.
ఆ రోజు చట్టానికి బీఆర్ఎస్ మద్దతు పలికి ఈరోజు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తారా? అని ద్వజమెత్తారు.

 

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను సంప్రదించిన తర్వాత 2015 జూన్ 18,19 తేదీల్లో కేంద్రం సమావేశం నిర్వహించిందని అన్నారు. ఆ సమావేశంలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు వాడుకోవడానికి ఒప్పందం కుదిరిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ రోజు కేసీఆర్ ఆ ఒప్పందానికి ఓకే చెప్పి.. రాష్ట్రానికి తీరని లోటు చేశారని ఆరోపించారు. 50శాతం వాటా గత ప్రభుత్వం ఎందుకు అడగలేదని నిలదీశారు. 299 టీఎంసీలకే అప్పటి నీటిపారుదల శాఖమంత్రి హరీష్ రావు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. విభజన హక్కుల ప్రకారం 68 శాతం అంటే.. 500 టీఎంసీలకు పైగా తెలంగాణకు రావాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కానీ తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -