Shyamala Devi: నర్సాపురం వైసీపీ అభ్యర్థిగా శ్యామలాదేవి పోటీ చేయనున్నారా?

Shyamala Devi: ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ ప్రధాన పార్టీలు కావడంతో ఈ రెండు పార్టీల నుంచి పోటీ చేయాలని భావించే అభ్యర్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. నర్సాపురం వైసీపీ అభ్యర్థిగా ప్రభాస్ పెద్దమ్మ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. కృష్ణంరాజు కుటుంబానికి నరసాపురం, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి పేరు ఉన్న నేపథ్యంలో ఆమె పోటీ చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయని వైసీపీ భావిస్తోంది.

 

టీడీపీ జనసేన కూటమి నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనను ఓడించే సామర్థ్యం ఉన్న బలమైన అభ్యర్థి శ్యామలదేవి అని వైసీపీ భావిస్తుండగా ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమె అంగీకరిస్తారో లేదో చూడాల్సి ఉంది. శ్యామలాదేవి ఎన్నికల్లో పోటీ చేయడానికి అంగీకరిస్తే మాత్రం నరసాపురంలో పోటాపోటీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని శ్యామలాదేవి ఎన్నికల్లో పోటీ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా శ్యామలాదేవి మొగల్తూరులో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. శ్యామలాదేవి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రభాస్ సైతం ఆమెకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికలకు సంబంధించి సపోర్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల నరసాపురం ఎంపీ స్థానాన్ని సులువుగా సొంతం చేసుకోవచ్చని వైసీపీ భావిస్తోంది.

 

అయితే వైసీపీపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో శ్యామలాదేవి పోటీ చేసినా ఎన్నికల్లో అనుకూల ఫలితాలను సాధించడం సులువు మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శ్యామలాదేవి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైతే ఆమెకు ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు దూరంగా ఉండే శ్యామలాదేవి ఎన్నికల ప్రచారం వల్ల విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

 

1999 సంవత్సరంలో కృష్ణంరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో కృష్ణంరాజును మంత్రి పదవి వరించింది. అయితే 2004 సంవత్సరంలో మరోమారు కృష్ణంరాజు ఈ స్థానం నుంచి పోటీ చేసినా ఆయనకు ఆశించిన ఫలితాలు అయితే దక్కలేదు. నరసాపురం ఎంపీ స్థానాన్ని కచ్చితంగా సొంతం చేసుకోవాలని టీడీపీ జనసేన, వైసీపీ భావిస్తున్నాయి.

 

రఘురామ కృష్ణంరాజు వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో ఆయనను ఓడించాలని సీఎం జగన్ సైతం ఫీలవుతున్నారు. నరసాపురం ఎంపీ స్థానం విషయంలో ఏపీ ప్రజలకు సైతం ఎంతో ఆసక్తి ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు దక్కుతాయో చూడాలి. నరసాపురంను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు పార్టీలు భారీ మొత్తంలో ఖర్చు చేసే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -