Samyuktha Menon: వామ్మో.. హీరోయిన్ సంయుక్త మీనన్ రియల్ క్యారెక్టర్ ఇదా?

Samyuktha Menon: తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సంయుక్తా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంయుక్త మీనన్ పేరు వినగానే గుర్తుకువచ్చే సినిమాలు భీమ్లా నాయక్, బింబిసార. ఈ సినిమాలలో నటించి క్రేజ్ ని సంపాదించుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈమె తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో హీరోయిన్గా నటించి సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉంది. కళ్యాణ్ రామ్ తో అభిషేక్ నామా నిర్మించే పీరియాడిక్ మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. బ్యాక్ టూ బ్యాక్ వరుసగా అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తాయి అనుకుంటే ఇక్కడ పరిస్థితులు మాత్రం వేరేగా ఉన్నాయని చెప్పవచ్చు.

సంయుక్త కు అవకాశాలు రావడం లేదు ఆమె రెమ్యూనరేషన్ కూడా పెంచడం లేదు. ఎందుకు అని ఆరా తీస్తే ఆమెతో ఒకసారి సినిమా చేసిన నిర్మాతలు మళ్లీ సినిమానా అంటూ వద్దు బాబోయ్ అనేస్తున్నారు. ఎక్కువగా ఆమె టైం పాటించడం లేదు అన్నది పెద్ద కంప్లైంట్ గా తెలుస్తోంది. సినిమా షూటింగులకు అయినా ఈవెంట్లకు అయినా ఏదైనా కూడా ఆమె రెండు గంటల ఆలస్యంగా వస్తుంది అని కొందరు నిర్మాతలు చెబుతున్నారట. అలాగే ఆమె నిర్మాతలను కూడా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానికి చాలా సంగతి పక్కన పెడితే వరుసగా సక్సెస్ లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు మాత్రం రావడం లేదు అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -