Samyuktha: సంయుక్త గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ లెగ్.. అదృష్ట దేవతంటూ?

Samyuktha: సాధారణంగా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే హిట్ సినిమా అందుకుంటే ఆ హీరోయిన్లకు తదుపరి వరుస సినిమా అవకాశాలు రావడం సర్వసాధారణం.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వరుసగా హిట్ సినిమాలలో నటిస్తే ఆ హీరోయిన్ కోసం ఎంతో మంది దర్శక నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి సినిమా నుంచి హిట్ సినిమాలను అందుకుంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటి శ్రీలల ఒకరు.

అయితే ఈ కోవలోకి మరొక హీరోయిన్ చేరిపోయారు. నటిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దూసుకుపోతున్నటువంటి వారిలో నటి సంయుక్త మీనన్ ఒకరు.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.

 

ఈ సినిమాకు మంచి సక్సెస్ కావడంతో అనంతరం ఈమెకు బింబిసారా, సార్ వంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో కూడా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ కావడంతో అమ్మడి ఖాతాలో హిట్టు పడింది.

 

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వడంతో సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్ అంటూ ప్రతి ఒక్కరు ఈమె పై ప్రశంసలు కురిపించడమే కాకుండా దర్శక నిర్మాతలు ఈమె కోసం క్యూ కడుతున్నారు.సంయుక్త మీనన్ సినిమాలో నటిస్తే ఇక ఆ సినిమా హిట్ అంటూ పలువురు నిర్మాతలు ఈమెని తమ సినిమాలలో తీసుకోవడానికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వరుస హిట్ సినిమాలను ఖాతాలో వేసుకుని తెలుగులో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -