Senior Citizens: వృద్ధులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ లోన్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Senior Citizens: ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వృద్ధులు అయిపోగానే వెంటనే వారిని బయట విడిచిపెట్టడం లేదంటే అనాధాశ్రమంలో చేర్పించడం వారిని కొట్టడం తిట్టడం నరకం చూపించడం లాంటివి చేస్తున్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు చాలామంది ఉన్నారు. అయితే పిల్లల కోసం 60 ఏళ్ల పాటు కష్టపడి పిల్లల కోసం గొడ్డు చాకిరీ చేసి ఏదో కృష్ణ రామా అనుకుని బతుకుదాం అనుకున్నా చాలామంది వృద్ధుల ఆశలు ఆవిరి అవుతున్నాయి.. వృద్ధులకు 60 ఏళ్ళు పై బడ్డాయి అంటే చాలు వెంటనే పిల్లలు వారిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఆ వయసులో వారు చేసేదేమీ లేక పిల్లలు పెట్టిన ఏదో ఒకటి తిని కాలం వెళ్లబుచుతున్నారు. వయసులో కష్టపడి మహారాజులా బతికిన వారు వృద్ధాప్యం వచ్చేసరికి రాజీపడలేక ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్నట్టుగా బతికేస్తూ ఉంటారు. బతికినంత కాలం దర్జాగా బతకచ్చు. సొంత ఇల్లు తప్ప బతకడానికి ఎటువంటి ఆదాయ మార్గం లేని వారి కోసమే ఈ రుణం. రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా బతకడం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతా పథకాల్లో పెట్టిన డబ్బు వడ్డీ రూపంలో వస్తుంది. అయితే వడ్డీ రేట్లు పడిపోయినా, ద్రవ్యోల్బణం పెరిగినా, మందుల ఖర్చులు పెరిగిపోయినా వృద్ధులకు ఆ వడ్డీ డబ్బులనేవి సరిపోవు.

 

ఇలాంటి వారి కోసం ఉంటున్న సొంత ఇంటి ద్వారా నెల నెలా పెన్షన్ లా డబ్బు పొందవచ్చు. సాధారణంగా ఒక ఇంటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుంది. లేదా ఇంటి మీద లోన్ తీసుకోవడం ద్వారా డబ్బు వస్తుంది. కానీ ఆ వయసులో లోన్ తీర్చలేరని చెప్పి వృద్ధులకు రుణం అనేది ఇవ్వరు. కానీ రివర్స్ మోర్టగేజ్ లోన్ అనేది మీ అవసరాలకు నెల నెలా ఆదాయం ఇస్తుంది. ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐ, ఐడీబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఈ రుణాన్ని ఇస్తున్నాయి. మీ ఇంటి విలువలో 80 శాతం మాత్రమే రుణంగా ఇస్తాయి. ఉదాహరణకు మీ ఇంటి విలువ కోటి రూపాయలు అయితే రూ. 80 లక్షల వరకూ రుణాన్ని ఇస్తాయి. 60 ఏళ్ళు ఆపైబడిన వయసు వారికి మాత్రమే ఇస్తాయి.

 

ఈ రూ. 80 లక్షలను మీకు నెలకు ఇంత చొప్పున ఇవ్వమన్నా ఇస్తుంది. లేదా 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి ఇవ్వమన్నా ఇస్తుంది. అయితే మీరు పెట్టుకున్న లోన్ అమౌంట్ రూ. 80 లక్షలకు వడ్డీ తీసుకోదు. కేవలం నెల నెలా మీకు బ్యాంకు చెల్లించే డబ్బులకు మాత్రమే వడ్డీ వేసుకుంటుంది. ఈ వడ్డీని, అసలును ఇప్పుడు తీసుకోదు. లోన్ పెట్టుకున్న వ్యక్తి, అలానే అతని భాగస్వామి చనిపోయిన తర్వాత ఆ ఇంటిని వేలం వేయగా వచ్చిన డబ్బుల్లోంచి తీసుకుంటారు. అది కూడా న్యాయబద్ధంగా ఎంత అయితే అంతే తీసుకుంటారు. మిగతా సొమ్ము పిల్లలు ఉంటే వారికి ఇచ్చేస్తారు. లేదంటే అయిన అప్పు పిల్లలు తీర్చేస్తే ఇల్లు పిల్లలకే ఇచ్చేస్తారు. లేదా పిల్లలే వేలంలో ఇంటిని కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంకులు 15 ఏళ్ళు, కొన్ని బ్యాంకులు 20 ఏళ్ల వరకూ మాత్రమే ఈ లోన్ పై నెల నెలా వాయిదాలను చెల్లిస్తాయి. లోన్ పీరియడ్ ముగిసిన తర్వాత బ్యాంకులు మీకు నెల నెలా వాయిదాలు చెల్లించడం ఆపేస్తాయి.కాబట్టి వృద్ధ దంపతులిద్దరూ రిటైర్మెంట్ తర్వాత రాజారాణిలా దర్జాగా బతకవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -