YS Jagan: మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్నవ్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్?

YS Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోని చూపిస్తూ ఒక్క హామీ అయినా నెరవేర్చారా అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ ఆయన ప్రకటించిన మేనిఫెస్టోని సక్రమంగా అమలు చేశారా లేదా అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. తనకు మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక బైబిల్ ఒక ఖురాన్ తో సమానం అని జగన్ వెల్లడించారు. అయితే ఈ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం కూడా ఉందని చెప్పాలి.

ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా 98% తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు అయితే మరి మధ్యపాన నిషేధం సంగతి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యం నిషేధిస్తానంటూ ఈయన ఒక ఏడాది మద్యం షాపులను తగ్గిస్తూ వచ్చారు. అయితే మద్యం దుకాణాల విషయంలో సరికొత్త పాలసీ అమలు చేస్తూ మద్యం దుకాణాలన్నింటినీ కూడా ప్రభుత్వ గుప్పెట్లో పెట్టుకున్నారు.

ఇక ప్రభుత్వం మద్యం అమ్ముతూ చీప్ మధ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి భారీ స్థాయికి అమ్మారు. అయితే ఇలా రేట్లు పెంచడం వల్ల పేదవారు మద్యం తాగలేరని చెప్పారు కానీ వాళ్ళు తాగుడకు అలవాటు పడితే ఇంట్లో వస్తువులైన తాకట్టు పెట్టి తాగుతారే తప్ప మానేది ఉండదని జగన్ గ్రహించలేకపోయారు. పైగా కల్తీ మద్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోయారు.

ఇలా మద్యపాన నిషేధం చేస్తానని ఎంతోమంది కుటుంబాలలో విషాదం నింపారనే చెప్పాలి అయితే ఇప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా మీ బిడ్డకు అండగా నిలవాలని కోరుతున్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవడమే కాకుండా బిడ్డను గెలిపించాలని ఎలా మొహం పెట్టుకొని అడుగుతున్నావు అంటూ ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పే ప్రజలకు ఓ పది రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారని నమ్మకమే జగన్మోహన్ రెడ్డిని ముందుకు నడిపిస్తోందంటూ పలువురు ఈయన వ్యవహర శైలి పై కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -