CM Jagan: ఇంటికి 500 రూపాయలు.. మద్యం సీసాలు.. సిద్ధం సభకు డబ్బులెక్కడివో చెప్పు జగన్?

CM Jagan: ఎన్నికల ప్రచారం అంటే.. సభా ప్రాంగాణం.. అధినేత ప్రసంగించడానికి ఓ వేదిక.. ఆ వేదిక ముందు ప్రజల కోసం కూర్చోవడానికి కుర్చీలు సభ స్థలంలో పార్టీ బ్యానర్లు. ఇంతకంటే ఎక్కువగా ఎవరూ ఊహించరు. కానీ.. వైసీపీ అధినేత జగన్ నిర్వహిస్తున్న ఒక్కో సిద్ధం సభకు సుమారు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం నాలుగు సభలకు కలిపి 360 కోట్ల పైనే ఖర్చు అయిందని ఓ అంచనా. మరి అంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల ప్రశ్నించారు. ఆమె మాత్రమే కాదు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రజాసంఘాల నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే.. జగన్ చెబుతున్నట్టు వైసీపీ సింగిల్ గా వస్తుంటే అన్ని పార్టీలు కలిపి వైసీపీపై దండయాత్ర చేస్తున్నాయని అనుకుందాం. ఆ దండయాత్రలో భాగంగానే ఆయా పార్టీలు వైసీపీపై అబద్దపు ప్రచారం చేస్తున్నాయని అనుకుందాం. కానీ.. సభా నిర్వహన చూస్తే ఆ ఆరోపణలు అంత ఈజీగా కొట్టపారేయలేమని అనిపిస్తోంది.

ఎందుకంటే.. సినిమా సెట్టింగులు, డెస్టినేషన్ వెడ్డింగులకు ఏర్పాటు చేస్తున్న ఈవెంట్స్‌ను సిద్ధం సభలు తలపిస్తున్నాయి. ర్యాంప్‌ వాక్‌ కోసం ఏర్పాటు, వేల సంఖ్యలో ఫ్లెక్సీలు, పోస్టర్లు, సభా ప్రాంగాణం మొత్తం గ్రీన్ మ్యాట్‌లు పరచడం.. ఇక వేదిక వరకూ అధినేత కారు వెళ్లేలా కార్పెట్లు ఇలా ఎక్కడా ఖర్చుకు తగ్గకుండా సభలను నిర్వహిస్తున్నారు. సభ దగ్గర అంత ఖర్చు చేస్తే మరి సభకు జనాలను తరలించడానికి ఎంత ఖర్చుచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నాలుగు సిద్దం సభలకు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. వేల కొద్ది ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటున్నారు. నాలుగో సిద్ధం సభకు అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన 25 జిల్లాల నుంచి జనాలను తరలించారు. ప్రజలను తరలించడానికి ఏకంగా 3,500 బస్సులను పెట్టారు. పార్వతీపురం నుంచి కూడా బస్సుల్లో తరలించారు. అంటే ఒడిశా బోర్డర్ నుంచి తరలించారు.

సభలకు వచ్చిన వారికి పెద్ద ఎత్తున తాయిలాలు అందించారు. వారు వచ్చిన దూరాన్ని బట్టి వారికి రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పంపిణీ చేస్తున్నారు. అది కాకుండా మందు, బిర్యాని, నైట్ వారు ఉండటానికి రూంలు ఇలా చాలనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మహిళలకు అయితే నగదు, బిర్యానీ పంపిణీ చేస్తున్నారు. ఒక బస్సులో జనాలను తరలించడానికి బస్సుకు, అందులో ఉండే జనాలకు రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. ఈ లెక్కన చూస్తే వీటికే వంద కోట్లు వరకూ ఖర్చు చేస్తున్నారు.

ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఇంత మొత్తం ఖర్చు చేస్తే.. షెడ్యూల వచ్చి.. నోటిఫికేషన్ రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. మరి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని షర్మిల ప్రశ్నించారు. ప్రజా పాలన అందిస్తున్నాం.. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా చేశామని జగన్ పదేపది చెబుతున్నారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు పడుతున్నాయని చెబుతున్నారు. అంత గొప్ప పాలన అందిస్తే ఒక్కో సభకు వంద కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు చేస్తున్నారు. సభకు వచ్చినవారికి ఒక్కొకరికి సుమారు రెండు వేల రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు? ఇసుక, సహజవనరులు దోపిడీ, మద్యం కుంభకోణాలపై వచ్చిన డబ్బును ఇప్పుడు బయటకు తీస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -