CM Jagan: ఉత్తుత్తి బటన్ లను నొక్కుతున్న జగన్.. ఎంత కష్టపడుతున్నా రూపాయి కూడా జమ కావడం లేదా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈయన సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అప్పుల ఊబిలోకి నెట్టేశారు. దీంతో ఆర్థిక శాఖ కూడా నిధులు మంజూరు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. అయితే ఎన్నికలు మరి కొద్ది రోజులలో జరగబోతున్నాయి అన్న తరుణంలో కూడా ఈయన చేయూత పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు నాలుగో విడత వేశారు.

ఇక ఈ డబ్బులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడానికి బడ్జెట్ ఆర్డర్ రిలీజ్ లేకుండానే చేయూత పథకానికి బటన్ నొక్కి షో ఫుట్ అప్ చేశారని తెలుస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాలో డబ్బు జమ కావాలి అంటే సుమారు 500 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అంత మొత్తంలో డబ్బులు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ ఏమాత్రం అనుమతి తెలుపలేదు.

ఇలా ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ లబ్ధిదారులందరినీ ఒకచోట చేర్చి వేదికపై ఉత్తుత్తి బటన్ నొక్కి అందరిని మభ్యపెట్టారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమవుతాయని జగన్మోహన్ రెడ్డి వేదికపై ప్రగల్బాలు పలికారు. అయితే ఈ సభ నిర్వహించి వారం రోజులు అవుతున్న ఇప్పటివరకు ఏ ఒక్కరికి డబ్బు వారి ఖాతాలో జమ కాకపోవటం గమనార్హం.

ఇలా పథకాల పేరిట ప్రజా దనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున సభలను ఏర్పాటు చేయడమే కాకుండా లబ్ధిదారులందరినీ ఒకచోట చేరి రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈయన మాత్రం లబ్ధిదారుల ఖాతాలో రూపాయి కూడా జమ చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ఇక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమం మొదలు పెడితే స్థానిక నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -