YSRCP Tweet: నీ పక్కన ఉన్న వాడే నిన్ను ఓడిస్తాడు పవన్.. వైసీపీ నేతల షాకింగ్ కామెంట్స్ వైరల్!

YSRCP Tweet: పొత్తులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గమైన పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న సంగతి మనకు తెలిసిందే. గత ఎన్నికలలో భీమవరం గాజువాక ప్రాంతాలలో పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు అయితే ఈసారి గెలుపే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.

ఈ క్రమంలోనే నిన్నటి నుంచి పిఠాపురంలో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు అయితే ఒక రోజుకే ఈ ప్రచార కార్యక్రమాలను వాయిదా వేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తూ వైసిపి పై చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వైసిపి ఈ ఎన్నికలలో ఎలాగైనా నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కంటైనర్ల నిండా డబ్బులు తరలిస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఇక నన్ను ఓడించడమే టార్గెట్ గా పెట్టుకున్నటువంటి వైసీపీ ఎంతో మంది మంత్రులను మండలాలకు ఇన్చార్జిలుగా నియమించారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇలా వైసిపి పట్ల పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు వైసీపీ పార్టీ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. నిన్ను ఓడించడానికి మేము కూడా అవసరం లేదు నీ పక్కన ఉన్నోడు చాలు అంటూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

నిన్ను ఓడించడానికి మేము అవసరం లేదు పవన్ కళ్యాణ్. నీ పక్కన ఉన్నాడు చూడు పసుపు చొక్కా వేసుకొని ఆయనే ఓడిస్తాడు నిన్ను. నీ మీద కక్ష కట్టింది కూడా మేము కాదు. మీ దత్త తండ్రి చంద్రబాబే. జాగ్రత్త అంటూ వైసీపీ అధికారక ఖాతా నుంచి చేస్తున్నటువంటి ఈట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఆయన ప్రచారానికి రావాల్సిన పనిలేదు నేనే పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటానని వర్మ తెలిపారు కానీ ఆయనకు టికెట్ రాకపోవడంతో టీడీపీ అధిష్టానం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించారు.

తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు బుజ్జగించడంతో ఈయన పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆయన ఓటమే లక్ష్యంగా వర్మ పనిచేస్తున్నారని వైసీపీ చెప్పకనే చెబుతూ చేసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -