KR Vijaya: కోట్ల ఆస్తులు ఉన్న కె.ఆర్. విజయ ప్రస్తుతం అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నారా?

KR Vijaya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అప్పటి అద్భుత నటి కె.ఆర్. విజయ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎక్కువగా అమ్మవారి పాత్రలు చేస్తూ నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. శ్రీకృష్ణ పాండవీయం సినిమా విజయకు ఒక మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ పై విజయ పలు సినిమాలో నటించి తెలుగు నాట నటిగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకుంది కే ఆర్ విజయ.

ఇక 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాలో సెంథిల్ మదర క్యారెక్టర్ చేసింది విజయ. ఇక హీరో నాగచైతన్య 100% లవ్ సినిమాలో కూడా కె ఆర్ విజయ నటించింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు కె ఆర్ విజయ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు వెల్లడించారు. 4000 గజాలలో విజయకు ఒక అద్భుతమైన ఇల్లు ఉండేదని తెలిపాడు. అంతేకాకుండా ఆ ఇంటి మీదే హెలికాప్టర్ కూడా ఆగేదని తెలిపాడు.

అందువల్ల విజయ ఇల్లు అప్పట్లో చాలా ప్రత్యేకంగా అనిపించేదని తెలిపాడు. ఇక విజయ ఇంట్లో మూడు పక్కల స్విమ్మింగ్ పూల్స్ ఉండేవని తెలిపాడు. ఇక ఇంటిలో ఎటు చూసినా ఎంతో అందంగా కనిపించేదని. తనకు 67 ఎకరాల ఒక గార్డెన్ ఉండేదని దాంట్లో ప్రతి సంవత్సరం విజయ స్వయంగా కార్తీకమాస వనభోజనాలు ఏర్పాటు చేసేదని దీనికోసం సినీ ఇండస్ట్రీలో పెద్దలు, సెలబ్రేటీలు వచ్చేవారు అని తెలిపాడు. అలా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందని కానీ ఇప్పుడు అవేం లేవని తెలిపాడు.

ఒక ప్లాట్ లో మాత్రమే కేఆర్ విజయ ఇప్పుడు ఉంటుందని తెలిపాడు. విధి విజయను చాలా మోసం చేసిందని తెలిపాడు. కొంతమందిని నమ్మి విజయ తన ఆస్తుల మొత్తం కోల్పోయిందని, తను చాలా పేదరికం నుంచి ఇంత ధనవంతురాలుగా ఎదిగిందని తెలిపాడు. ఇక చివరికి తాను అదే పేదరికంలోకి వెళ్లిందని ఆ సీనియర్ జర్నలిస్ట్ రామారావు ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: వైసీపీ మేనిఫెస్టోలో మాయమైన ఈ స్కీమ్ గురించి తెలుసా.. మహిళలంటే లోకువా?

YSRCP Manifesto: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వబోతున్నారని...
- Advertisement -
- Advertisement -