Mega Heroes: చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరుకు మెగా హీరోలు నటించిన రీమేక్ సినిమాలివే?

Mega Heroes: సాధారణంగా ఒక భాషలో తెరకెక్కి మంచి విజయం సాధించిన సినిమాలు మరొక భాషలో రీమేక్ కావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో రీమెక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాయి.ఇకపోతే మెగా హీరోలు కూడా ఎన్నో రీమేక్ సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ రీమెక్ సినిమాలలో ఏ హీరో ఎలాంటి విజయాన్ని అందుకున్నారు ఎవరు ఫ్లాప్ ఇచ్చారు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

చిరంజీవి: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా తమిళ రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే తాజాగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళంలో లూసిఫర్ సినిమాకి రీమేక్ చిత్రం. ఇక ఈయన నటిస్తున్న భోళా శంకర్ సినిమా కూడా వేదాళం సినిమాకి రీమేక్ చిత్రంగా రాబోతుంది.

పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ కూడా తన సినీ కెరియర్ లో రీమేక్ సినిమాలలో నటించారు.గబ్బర్ సింగ్ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా దబాంగ్ కు రీమేక్ గా తెరకెక్కింది. అలాగే మలయాళ అయ్యప్పనుమ్ కోషియంకి రీమేక్ గా భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్ గా తీన్మార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాటమరాయుడు సినిమా తమిళ సినిమా వీరంకు రీమేక్ గా తెరకెక్కింది.

రామ్ చరణ్: మెగా హీరో రామ్ చరణ్ నటించిన సినిమాలలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన సినిమా ధ్రువ. ఈ సినిమా తమిళ చిత్రం తని ఒరువన్ కు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -