Janasena Glass Symbol Confusion: గాజు గ్లాస్ గందరగోళం వెనుక తప్పెవరిది.. జనసేనకు చేటు చేయాలనే కుట్ర చేశారా?

Janasena Glass Symbol Confusion: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరికీ కూడా ఓట్లు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే పార్టీలకు గుర్తింపు ఉంటే ఆ పార్టీ సింబల్ ను అధికారకంగా రిజర్వ్ చేసి పెడతారు అలా కాకుండా పార్టీలకు గుర్తింపు లేకపోతే ఆ పార్టీ గుర్తును ఫ్రీ సింబల్స్ లో ఉంటాయి అంటే ఇండిపెండెంట్గా ఏ అభ్యర్థులు అయితే పోటీ చేస్తారో వారికి ఈ ఫ్రీ సింబల్స్ అన్నింటినీ కేటాయిస్తూ ఉంటారు అలాంటి ఫ్రీ సింబల్స్ లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ఉండటం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్లో రెండే ప్రధాన పార్టీలు అన్నట్టుగా వైసిపి పార్టీకి ఫ్యాన్ గుర్తు రిజర్వేషన్ కాగా టిడిపికి సైకిల్ రిజర్వ్ అయింది అయితే ఎన్నికల సమయంలో ఓట్లను చీల్చడం కోసం చాలామంది స్వతంత్ర అభ్యర్థులకు నామినేషన్స్ వేస్తూ ఇలా ఫ్రీ సింబల్స్ అందుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ గాజు గ్లాస్ కూడా ఫ్రీ సింబల్స్ లోకి చేరిపోవడంతో చాలా చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో వారికి మాత్రమే గాజు గ్లాస్ కేటాయించారు అయితే జనసేన పోటీ చేయని చోట స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ కేటాయించారు దీంతో ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితులలో ఉన్నారు. కొన్నిచోట్ల గ్లాస్ గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేయడం మరికొన్ని చోట్ల గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయద్దు అంటూ ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడటానికి కారణం ఎవరు అంటే కొంతవరకు పార్టీ అధినేతలది తప్పు అయినప్పటికీ మరోవైపు ఓట్లను చీల్చడం కోసం ప్రత్యర్థులు కూడా ఇలాంటి కుట్రలకు పాల్పడుతూ ఉంటారు అందుకే పార్టీ అధినేతలు ఈ విషయాన్ని గుర్తించుకొని ఈసీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇలా ఫిర్యాదు చేయడంతో ఈసీ అలాంటి సింబల్స్ ని ఫ్రీ సింబల్స్ లో పెట్టకుండా చేస్తారు అయితే ఎన్నికల నామినేషన్ పూర్తి అయినప్పటికీ గాజు గ్లాస్ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో ఎన్నికల అధికారులు దానిని ఫ్రీ సింబల్స్ లోకి పెట్టారు. మొత్తానికి ఈ గాజు గ్లాస్ గుర్తు పెద్ద ఎత్తున గందరగోల పరిస్థితులను ఏర్పరచిందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -