Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ మధ్య విభేదాలు.. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందా?

Hari Hara Veera Mallu : టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ చేసినది తక్కువ సినిమాలు అయినప్పటికీ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇక కొన్ని సంవత్సరాలు పాటు రాజకీయాలలో కొనసాగినటువంటి ఈయన రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రీఎంట్రీ తర్వాత ఈయన నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు భారీ హెట్ అందుకున్నాయి.ఇకపోతే ఈ రెండు సినిమాలు మంచి హిట్ కావడంతో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా హరిహర వీరు మల్లుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమాని ఏం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నేర్పిస్తున్నారు

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కూడా అయింది. దాదాపు 50 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగుకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్లో కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుందని వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన ప్రీ వర్క్ షాప్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబర్ నెలలో ఎలాంటి షూటింగ్ పనులను జరుపుకోలేదని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ కు డైరెక్టర్ కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం.స్క్రిప్టులో కాస్త మార్పులు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించడంతో ఆ మార్పులు చేయడానికి క్రిష్ సానుకూలంగా లేరని ఈ విషయంపైనే వీరిద్దరికీ భేదాభిప్రాయాలు రావడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందనే వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -