Munugodu elections మునుగోడు పోలింగ్‌లో జాడ లేని యువ ఓటర్లు.. రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోన్న అనుమానాలు

Munugodu elections మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ పలుచోట్ల ఈవీఎంలు మొరాయించగా.. కొన్నిచోట్ల బీజేపీ, టీఆర్ఎస్ వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు మినహా.. మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. బూత్ వద్ద భారీగా బారులు తీరారు. ఓటర్ స్లిప్పులతో పాటు ఏదైనా గుర్తింపు పత్రం తీసుకొచ్చిన వారికి ఓటు వేసే అవకాశం సిబ్బంది కల్పిస్తోన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 6 గంటలలోపు వచ్చి పోలింగ్ కేంద్రంలో లైన్ లో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. ఉదయం తొలి రెండు గంటలు కాస్త మందకొడిగా పోలింగ్ జరగ్గా.. 9 తర్వాత పోలింగ్ ఊపందుకుంది.

 

 

ఉదయం 9 గంటల వరకు 11 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత నుంచి పోలింగ్ ఒక్కసారిగా ఊపందుకుంది. 11 గంటలకు 25 శాతానికి చేరుకోగా.. 1 గంటలకు 45 శాతానికి చేరుకుంది. నాలుగు గంటలకు 60 శాతానికిపైగా నమోదైంది. గత ఎన్నికల్లో 91.2 శాతం పోలింగ్ మునుగోడులో నమోదవ్వగా.. ఈ సారి అంది పెరిగుతుందా.. లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే యువ ఓటర్లు ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించడం లేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ లో యువ ఓటర్లు ఎక్కడికి పోయారనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.

 

పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి వృద్ధులు, నడివయస్సు వారే దర్శనమిస్తున్నారు. కానీ యువ ఓటర్లు ఎక్కడా కనిపించలేదు. యువకుల సందడి ఎక్కడా కనిపించలేదు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువకులు అయితే తొలిసారి ఓటు వేసేందుకు బాగా ఆసక్తి చూపుతారు. కానీ మునుగోడు పోలింగ్ లో యువ ఓటర్లే కనిపించకడం విశేషంగా మారింది. దీనికి అనేక కారణాలు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యువ ఓటర్లు చదువు, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉంటారని, అందుకే ఓటు వేయడానికి రాలేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఓటు వేసేందుకు దూర ప్రాంతాల నుంచి వస్తారని, ఉపఎన్నికలే కదా అని లైట్ తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.

 

ఈ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు. వచ్చే డిసెంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకే ఉపఎన్నికలో ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న యువకులు రాలేదని చెబుతున్నారు. అయితే యువ ఓటర్లు కనిపించకపోవడం వెనుక అనేక అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోన్నాయి. దీని వెనుక బీజేపీ ప్లాన్ ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీజేపీ కూడా ఇది టీఆర్ఎస్ ప్లాన్ అని అంటోంది. బీజేపీకి యువకుల్లో క్రేజ్ ఉందనే ప్రచారం సాగుతోంది. అందుకే వారిని రానివ్వకుండా టీఆర్ఎస్ చేసిందని కాషాయ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

 

టీఆర్ఎస్ కూడా తమకు యువ ఓటర్లలో బలంగా ఉందని, అందుకు వారిని రానివ్వకుండా బీజేపీ కుట్రలు పన్నిందని గులాబీ నేతలు అంటున్నారు. ఇలా ఎవరికి వారు పరస్పర విమర్శలు చేస్తున్నారు. ఏ ఎన్నికల్లో తీసుకున్నా.. యువ ఓటర్లు ఓటు వేసేందుకు ఉదయం నుంచి సందడి చేస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేస్తూ కనిపిస్తారు. ఓటు వేసిన తర్వాత ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉత్సాహం కనబరుస్తారు. కానీ హోరాహోరీగా జరిగిన మునుగోడు ఉపఎన్నికలో యువ ఓటర్ల హడావుడి కనిపించకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోన్నాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -