Vote Registration: ఓటు హక్కు నమోదుకు చివరి తేదీ ఇదే.. నమోదు చేసుకోకపోతే మాత్రం భారీగా నష్టపోతారా?

Vote Registration: మే 13వ తేదీ ఏపీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అంతేకాకుండా ఏప్రిల్ ఒకటవ తేదీకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుకు నమోదు చేసుకొని ఓటును వినియోగించి సరైన నాయకుడును ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

ఓటు హక్కు లేనటువంటి వారు వెంటనే ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తూ వచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలలో 18 సంవత్సరాలు వయసు కలిగి ఉండి ఓటు హక్కు లేని వారికి ఎన్నికల అధికారి ఓటు హక్కు గడువు తేదీని పెంచింది ఏప్రిల్ 14వ తేదీ వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.

ఏప్రిల్ 1వ తేదీకి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులందరూ కూడా అప్లై చేసుకోవచ్చని వారి దరఖాస్తును పది రోజులలో పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇలా పది రోజులలో ఓటు హక్కును పొంది మే 13వ తేదీ జరగబోయే ఎన్నికలలో తమ ఓటు వినియోగించుకొని అవకాశాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రిసైన్డింగ్ అధికారి ఎన్ హెచ్ ప్రవీణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో తెలిపారు.

ఇక ఇప్పటికీ ఓటు హక్కు అప్లై చేయని వారు కొత్త ఓటు కోసం హెల్ప్ లైన్ యాప్ ద్వారా లేదా బీఎల్వోల ద్వారా ఫారమ్ 6లో దరఖాస్తు చేయాలి. ఇలా తమ ఓటు హక్కును దరఖాస్తు చేసుకున్న పది రోజులలోనే అధికారులు దరఖాస్తులను పరిశీలించి ఓటుకు అర్హులా కాదా అని నిర్ణయించి ఓటర్ల జాబితాలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -