Vastu: కలలో ఆరిపోయిన దీపం చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Vastu: సాధారణంగా మనం పడుకున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తుంటాయి. అందులో కొన్ని చెడ్డ కలలు కొన్ని మంచి కలలు వస్తూ ఉంటాయి. అయితే చాలామంది మంచి కలలు వచ్చినప్పుడు పాజిటివ్ గా తీసుకొని పీడకలలు వచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. ఆ పీడకలల వల్ల హాని లేదంటే కీడు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. స్వప్న శాస్త్ర ప్రకారం కలలు రాబోయే భవిష్యత్తును సూచిస్తాయి. అయితే మనకు కలలో ఎన్నో రకాల వస్తువులు మనుషులు జంతువులు, పక్షులు ఇలా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అయితే కలలో మండుతున్న లేదంటే ఆరిపోయిన దీపాన్ని చూస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

సాధారణంగా ఒక వ్యక్తి కలలో మండుతున్న దీపాన్ని చూస్తే అది మంచిది సంకేతం అని చెప్పవచ్చు. మండుతున్న దీపాన్ని కలలో చూడడం వల్ల రాబోయే భవిష్యత్తులో గౌరవం ప్రతిష్ట పెరుగుతుందని అర్థం. అంతేకాకుండా సమాజంలో మీ కుటుంబ స్థితి పెరుగుతుందని, త్వరలోనే రాజయోగపడుతుందని అర్థం. అంతేకాకుండా వెలుగుతున్న దీపం మీ జీవితంలో ఉన్న చీకట్లను పారదోలి వెలుగును ప్రసరింపజేస్తుందని అర్థం. త్వరలో మీ విజయ మార్గం తెరవబోతోందని అర్థం. అలాగే కలలో మండుతున్న అఖండ జ్యోతిని చూస్తే ఆ వ్యక్తి దీర్ఘాయువుతో ఉంటాడని అర్థం.

 

అదేవిధంగా భవిష్యత్తులో అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అయితే చాలామంది కలలో వెలుగుతున్న దీపాన్ని శుభసూచికంగా ఆరిపోయిన దీపాన్ని చూస్తే అశుభ సూచికంగా పరిగణిస్తారు.
మీ సంకల్ప శక్తి బలహీనపడుతుందని కలల గ్రంథాలు సూచిస్తున్నాయి. మీరు ఏదైనా పనిలో కష్టపడితే, ఆ పనిలో మీ కష్టానికి తగ్గట్టుగా ఫలితం లభించదుమీ కలలో ఆరిపోయిన దీపం మీరు పని చేసే ఏ రంగంలోనైనా వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తుంది. అంతే కాకుండా అది మీకు ఆరోగ్య సంబంధిత సమస్యల గురించి కూడా సూచిస్తుందని అర్థం. మీరు అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడబోతున్నాయని అర్థం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -