Deepam: దీపం పెట్టే సమయంలో అస్సలు చెయ్యకూడని తప్పులేంటో తెలుసా?

Deepam: నిత్య దీపారాధన చేసే ఇల్లు ఎప్పుడు కూడా సంతోషంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో నిండి ఉంటుందని చెప్పవచ్చు. అందుకే పండితులు కూడా నిత్య దీపారాధన చేయమని చెబుతూ ఉంటారు.. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు క‌చ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. కొందరు తెలిసి తెలియక దీపారాధన చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. మరి దీపారాధన చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రతి రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపంలోనే దేవతలు అందరూ కూడా ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే మీరు వెలిగించిన చోట దైవశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు. దేవతలు అందరూ కూడా వస్తారు. ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు. ఉదయం స్నానం చేశాక దీపాన్ని వెలిగించవచ్చు. సాయంత్రం కూడా స్నానం చేసి దీపాన్ని వెలిగించాలి. మాంసాహారం తినే వారు కూడా ప్రతి రోజూ దీపారాధన చేయడానికి తలస్నానం చేయక్కర్లేదు. మామూలు స్నానం చేస్తే చాలు.

 

దీపం పెట్టే ప్రమిద‌ బంగారంతో చేసింది కానీ వెండి, ఇత్తడి లేదంటే మట్టిదైనా కూడా ఫ‌రవాలేదు. దీపపు ప్రమిద‌ని ఎప్పుడూ నేల మీద పెట్టకూడదు. అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీపం పెట్టే ప్రమిద‌ స్టీలు, ఇనుపది అయ్యి ఉండకూడదు. దీపం పెట్టడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉన్న తర్వాత మాత్రమే దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడవాలి. బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొంచెం పసుపు, కుంకుమ చల్లి ఆ తర్వాత దీపం వెలిగించాలి. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక వ‌త్తితో చేయకూడదు. అది అశుభ సూచికం. కనీసం రెండు వ‌త్తులైనా సరే వెలిగించాలి. దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగించడం ఎంతో మంచిది. ఆవు నెయ్యి లేదు అనుకున్న వారు నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. ఏ ఇంట అయితే రెండు పూట‌లా దీపం వెలుగుతుందో, ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దుష్టశక్తులన్నీ పోయి ఆ ఇంట అంతా మంచే జరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. దీపారాధన చేసే వారికి గ్రహ దోషాలు, పీడలు వంటివి ఉండవు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -