Vastu: నెమ‌లి ఫించాన్ని ఇలా పెడితే వాస్తు దోషాలు, శ‌ని బాధ‌ల నుంచి బయట పడవచ్చా .. ఏం చేయాలంటే?

Vastu: సాధారణంగా మనం మన ఇంట్లో ఎన్నో రకాల అలంకరణ వస్తువులను అలంకరించి ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకుంటాము.ఇలా ఇంటి అలంకరణ వస్తువులలో భాగంగా చాలామంది నెమలి పించం కూడా ఇంటిలో అలంకరణలో భాగంగా అమరుస్తూ ఉంటారు. అయితే నెమలి పించం ఇలా ఇంట్లో అలంకరణ వస్తువుగా పెట్టుకోవడం వల్ల చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా ఎంతో మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అలాగే వాస్తు దోషాలను కూడా పారద్రోలుతుంది.

నెమలి పించం ఇంట్లో పెట్టుకునే వారు మూడు నెమలిపించాలని తీసుకొని వాటిని నల్లని దారంతో కట్టాలి. తర్వాత కొంచెం వక్కపొడి చల్లి నీళ్లను చిలకరించండి ఆ తర్వాత ఓం శనీశ్వరాయ నమః అని 21 సార్లు చదవటం వల్ల మనపై ఉన్నటువంటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి.ఇక చాలామంది వాస్తు దోషాలతో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఎనిమిది నెమలిపించాలని తీసుకోవాలి.

 

ఈ విధంగా 8 నెమలి పించాలను తీసుకొని వాటికి తెల్లని దారంతో కట్టి ఓం సోమాయ నమః అని జపించండి. అంతే వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీ ఇంట్లో డబ్బులు భద్రపరచుకొనే చోట నెమలి పించం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి సంపదకు లోటు ఉండదు.ఈ విధంగా నెమలి పించం ఇంట్లో ఉండటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

 

కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా ఆఫీసులలో లేదా వ్యాపారాలు చేసే చోట కూడా నెమలి పించం లేదా నెమలి పించం ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవడం కూడా ఎంతో మంచిది. పడక గదిలో కనుక నెమలి ఫించం పెట్టుకున్నట్లైతే భార్యాభర్తల మధ్య బంధం మెరుగుపడుతుంది. అర్థం చేసుకునే గుణం అలవాటు అవుతుంది. ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా పెడితే మన ఇంటి పై ఉన్నటువంటి చెడు దిష్టి తొలగిపోయి అంతా శుభమే కలుగుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -