Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త.. కార్తీకదీపం అయిపోయిందట!

Karthika Deepam: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకు సీరియల్ ‘కార్తీకదీపం’. దాదాపు 1400లకుపైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న కార్యక్రమం ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సీరియల్ దెబ్బకు బిగ్‌బాస్ లాంటి రియాలిటీ షోలు కూడా బొల్తా కొడుతున్నాయి. ఒకరకంగా స్టార్ మాకు ‘కార్తీకదీపం’ సీరియలే దిక్కని చెప్పవచ్చు. టీఆర్‌పీ పరంగా కార్తీకదీపం సీరియల్ ఫస్ట్ ప్లేస్‌లో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ సీరియల్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. త్వరలో ఈ సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడటంతో హమ్మయ్య.. ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండొచ్చని, రోజూ కార్తీకదీపం సీరియల్‌లో ఏం జరుగుతుందా? అనే టెన్షన్ పోతుందని అంటున్నారు. కానీ మరికొందరు మాత్రం సీరియల్‌కి ఎండ్ కార్డ్ పడుతుందని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఎపిసోడ్‌ను కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

అయితే కార్తీకదీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ గుర్తుకు ఉండే ఉంటుంది. ఈ పాత్రలో కన్నడ బ్యూటి శోభా శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే కన్నడలో పలు సీరియల్స్, సినిమాలు చేసిన ఈ భామ.. తాజాగా కార్తీకదీపం సీరియల్‌లోని తన పాత్రపై యూట్యూబ్ ఛానల్‌లో సంచలన వ్యాఖ్యలు చేసింది. కార్తీకదీపం సీరియల్‌లో తన పాత్రను ముగించారనీ పేర్కొంది. మోనిత జైలుకు వెళ్తుందని, ఇక తిరిగి రాదని, దాంతోనే మోనిత పాత్రను పూర్తిగా ముగించారనీ ఆమె చెప్పుకొచ్చింది. మోనిత పాత్ర నుంచి, కార్తీకదీపం సీరియల్ నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉందని పేర్కొంది. డైరెక్టర్ తనకు కాల్ చేసి.. ఈ విషయం చెప్పాడని, కానీ మొదట్లో ఆయన మాటలు నమ్మలేదని తెలిపింది. మోనిత పాత్రకు ఎండ్ కార్డ్ పెట్టడంతో కాస్త ఎమోషనల్ అయినట్లు శోభా శెట్టి చెప్పారు. కాగా, మరోవైపు కార్తీకదీపం సీరియల్ అభిమానులు మాత్రం మోనిత పాత్రను ఉంచాలని, ఈ సీరియల్‌కు మోనితనే వెన్నెముక అని కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -