Chikkaballapur City: పెళ్లైన వివాహిత వెంట ప్రేమించమని తిరిగిన యువకుడు.. కాదనడంతో ఆత్మహత్య?

Chikkaballapur City: ప్రస్తుత రోజుల్లో చాలామంది మగవారు ఆడవారు వివాహేతర సంబంధాలు అన్న మోజులో పడి పచ్చని సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. తాళి కట్టిన భార్యను కాదని ఇతర స్త్రీలతో ఉండటం కోసం చాలామంది మగవారు మగ్గుచూపుతున్నారు. అదేవిధంగా తాళి కట్టిన భర్తను కాదనుకొని ఇతర పురుషులతో ఉండడానికి మహిళలు సైతం ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి ఒకరిని ఒకరు చంపుకోవడం వల్ల కూడా వెళ్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.

 

కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పట్టణంలోని కోటే ప్రాంతంలో నవీన్ అనే 27 ఏళ్ళ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. నవీన్ స్థానికంగా కార్పెంటర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లయిన కొంతకాలం పాటు బాగానే ఉన్నా నవీన్ బుద్ది ఆ తరువాత క్రమంగా గాడి తప్పింది. పెళ్లయి పిల్లలు ఉన్న పక్కింటి వివాహితతో పెళ్లి ప్రేమ అంటూ ఆ వివాహితను విసిగించాడు. అంతేకాకుండా ఆమె పేరును చేతి పై పచ్చబొట్టుగా కూడా పొడిగించుకున్నాడు. సదరు మహిళ భర్త ముందే తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. చాలాసార్లు ఆమె నవీన్ కు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ నవీన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.

 

ఇక నవీన్ పిచ్చి ప్రేమ పరాకాష్టకు వెళ్ళిపోయి వివాహిత వెంటపడుతూ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను బతకలేను అని బెదిరించాడు. ఇటీవల మరొకసారి నవీన్ ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పగా ఆమె అంగీరించకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రవీణ్ అతని ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు విషయం తెలుసుకున్న నవీన్ భార్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -