Naveen: నిజమైన ప్రేమకు ఇదే గతి పడుతుందా.. పాపం నవీన్ అంటూ?

Naveen: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది నవీన్ హత్య కేసు. ప్రేమించిన యువతి కోసం స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు హరిహరకృష్ణ. దీంతోపాటు నవీన్‌ మృతదేహం మీద తన పగను తీర్చుకున్నాడు. అతడి శరీరంలోని భాగాలను వేరు చేసి, మృతదేహాన్ని గుర్తు పట్టరాని విధంగా మార్చాడు. ఆఖరికి నవీన్‌ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఆధారంగా ఆ డెడ్‌బాడీ అతడిదే అని గుర్తు పట్టారు. మరి ఇంతకు నవీన్‌ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు ఎవరిదనై దానిపై చర్చ నడుస్తోంది.

 

అబ్దుల్లాపూర్‌మెట్‌లో బీటెక్‌ విద్యార్థి నవీన్‌ దారుణ హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు హరిహరకృష్ణతో పాటు అతడి ప్రేయసి, స్నేహితుడు హసన్‌ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం యువతిని చంచల్‌గూడ జైలుకు తరలించగా, హసన్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.

నవీన్‌ని దారుణంగా హత్య చేసిన హరి.. అతడి శరీరం నుంచి గుండెను వేరు చేశాడు. వేళ్లను కట్‌ చేశాడు. తన మనసులో ఉన్న కసినంతా నవీన్‌ మృతదేహం మీద చూపాడు. ఇక నవీన్‌ మృతదేహం గుర్తు పట్టలేనంత దారుణంగా తయారయ్యింది. ఈ క్రమంలో నవీన్‌ చేతి మీద ఉన్న పచ్చ బొట్టు కారణంగా ఆ మృతదేహం అతడిదే అని అర్థం అయ్యింది. నవీన్‌కు తల్లి అంటే ఏంతో ప్రేమ. అయితే దురదృష్టవశాత్తు నవీన్‌ తల్లిదండ్రులు విడిపోయారు. దాంతో నవీన్‌ తల్లి దగ్గరే ఉండేవాడు. ఈ క్రమంలో తల్లి మీద తన ప్రేమకు గుర్తుగా చేతి మీద అమ్మ అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. దాన్ని చూసి ఆ మృతదేహం నవీన్‌దే అని గురించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan-KTR: జగన్, కేటీఆర్ నోటివెంట ఉమ్మడి రాజధాని మాట.. కామెంట్ల వెనుక ప్లాన్ ఇదేనా?

CM Jagan-KTR: ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఒకవైపు మరోవైపు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు ఓకే రోజు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అయితే ఈ...
- Advertisement -
- Advertisement -