Varun Tej: జనసేన తరపున నిహారిక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా.. వరుణ్ తేజ్ ఏం చెప్పారంటే?

Varun Tej: ఆంధ్రప్రదేశ్లో మరొక నెలన్నర వ్యవధిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలా కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ మొత్తం రాజకీయ వేడి రాజుకుంది. ప్రతి ఒక్క పార్టీ నేతలు తమ అభ్యర్థులను ఎంపిక చేసి ఎన్నికల పోటీలో నిలబెడుతున్నారు. అదేవిధంగా మరోవైపు ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మరీ ఎన్నికల బరిలోకి దిగబోతోంది.

ఈ క్రమంలోనే జనసేన పార్టీ నుంచి నిహారిక పోటీ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గం నుంచి ఈమె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగబోతున్నారంటూ వార్తలు రావడంతో ఎంతో మంది అభిమానులు నిహారిక కనుక ఎమ్మెల్యేగా నిలబడితే తప్పకుండా విజయం సాధిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విధంగా నిహారిక పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖండించారు. ప్రస్తుతం ఈయన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ విడుదల కాబోతోంది దీంతో ఈయనకు ఒక ఇంటర్వ్యూలో నిహారిక ఎన్నికలలో నిలబడటం గురించి ప్రశ్న ఎదురయింది. దీంతో ఈ ప్రశ్నలపై వరుణ్ స్పందిస్తూ నిహారిక గురించి వస్తున్నటువంటి వార్తలలో నిజం లేదని తెలిపారు.

ఇక మేము రాజకీయాలలోకి రావాలన్న రాజకీయాలలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న నాన్న పెదనాన్న బాబాయ్ సలహాలు తీసుకుంటామని వారు ఎలా చెబితే అలా వింటామని తెలిపారు. ఇక ఎన్నికల ప్రచారంలో మా అవసరం ఉందని భావిస్తే తప్పకుండా ఎన్నికల ప్రచారంలోకి వస్తామంటూ కూడా వరుణ్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -