Lavanya-Niharika: నిహారికకు భారీ షాకిచ్చిన లావణ్య.. నీకు దండం పెడతాను నా పెళ్లికి రావద్దంటూ?

Lavanya-Niharika:  మెగా కుటుంబంలో త్వరలోనే పెళ్లి భాజలు మోగబోతున్నాయి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఇక వీరి వివాహం నవంబర్ నెలలో ఉండబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే వీరి వివాహం ఇండియాలో కాకుండా ఇటలీలో చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇక వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెళ్లి పనులలో ఇరువురి కుటుంబ సభ్యులు ఎంతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇక త్వరలోనే వీరి పెళ్లి తేదీని కూడా అధికారకంగా ప్రకటించబోతున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహం జరగడానికి నిహారిక కూడా కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. వీరి ప్రేమ విషయాన్ని ఇంట్లో ఒప్పించడానికి నిహారిక కూడా తన వంతు ప్రయత్నాలు చేశారట. దీంతో లావణ్య నిహారిక మధ్య కూడా ఎంతో మంచి బాండింగ్ ఏర్పడింది.

ఇకపోతే నటి లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పెళ్లి విషయం తెలియడంతో వీరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. అయితే వీరి పెళ్లి దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక విషయంలో లావణ్య త్రిపాఠి నిహారికకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట ఇలా చేస్తే కనుక దయచేసి నువ్వు నా పెళ్ళికి రావద్దు అంటూ ఆమెకు దండం పెట్టేసారని తెలుస్తుంది. నిహారికను లావణ్య పెళ్లికి రావద్దు అని ఎందుకు అన్నారు అనే విషయానికి వస్తే…

నిహారిక గత కొద్దిరోజుల క్రితం తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే పెళ్లిలో అందరూ కూడా తనని ఇదే ప్రశ్న వేస్తారు అంటూ వారికి నేను ఏ సమాధానం చెప్పాలి అంటూ నిహారిక తన తల్లి వద్ద ఈ విషయం గురించి బాధపడుతూ ఏడ్చారట అయితే ఈ విషయం తెలిసినటువంటి లావణ్య నువ్వు పెళ్లిలో సంతోషంగా ఉండాలి ఇలా ఏడుస్తూ ఉంటే అసలు పెళ్లికే రావద్దు నీ సంతోషమే మాకు ముఖ్యం అంటూ తనకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -