Pune: వివాహేతర సంబంధం పెట్టుకున్న వదిన.. అలాంటి పని చేసిన మరిది?

Pune: ప్రస్తుత సమాజంలో రోజురోజుకీ వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యాభర్తలు వారి చక్కటి కాపురాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. కొందరు వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషులు కట్టుకున్న భార్యని హత్య చేస్తున్నారు. అలాగే కొందరు మహిళలు తాళి కట్టిన భర్తను కాదనుకొని వారిని చంపి ఇతర పురుషులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

తాజాగా అటువంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పూణే పరిధి లోని కోంద్వా గ్రామంలో ఆమ్రపాలి అనే మహిళ నివసిస్తోంది. ఆమెకీ గతంలో ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తితో పెళ్లి అయ్యింది. పెళ్లైన చాలా కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేస్తూ వచ్చింది. కానీ కొంత కాలానికి ఈ మహిళకు ఒక కూతురు, కుమార్తె జన్మించింది. అయితే పెళ్ళైన కొంతకాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ వివాహిత భర్తను కాదని స్థానికంగా ఉండే కొంతమంది యువకులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అయితే ఇదే విషయం కొద్దీ రోజులకీ ఆమె మరిది వైభవ్ వాఘ్మారేకు తెలిసింది.

దాంతో అతడు బుద్ధి మార్చుకోవాలని అనేకసార్లు వదినకు చెప్పి చూశాడు. కానీ, ఆమ్రపాలి అవేం పట్టించుకోకుండా ఏకంగా మరిది ముందు ప్రియుడితో తిరుగుతూ కనిపించింది. ఇక మరిదికి పట్టరాని కోపం వచ్చింది. ఇలా అయితే కాదని భావించిన వైభవ్ ఇంటి పరువు తీస్తున్న వదినను చంపాలని అనుకున్నాడు. తాను అనుకున్నట్లే వైభవ్ బుధవారం రాత్రి వదినతో మరోసారి గొడవ పడ్డాడు. క్షణికావేశంలో ఊగిపోయిన వైభవ్ వదినతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాల పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హుటా హుటిన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -