Uorfi Javed: ఎమోషనల్ అయిన ప్రముఖ నటి ఉర్ఫీ జావెద్.. ఏం చెప్పారంటే?

Uorfi Javed: ఉర్ఫీ జావెద్.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చిత్ర విచిత్రమైన వస్త్రధారణ. ఉర్ఫీ జావెద్ వేసుకునే డ్రెస్సులు చూస్తే ఇంత దారుణంగా కూడా డ్రస్సులు వేసుకుంటారా అన్న అనుమానం రాక మానదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఆలోచిస్తూ కేవలం తన ప్రైవేట్ పార్ట్స్ మాత్రమే కవర్ చేసుకునే విధంగా డ్రెస్సులు వేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. ఇక ఆమెపై వచ్చిన ట్రోలింగ్స్ దారుణమైన కామెంట్స్ మరేవరిపై వచ్చి ఉండవు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఎన్ని విధాలుగా నెగిటివ్గా కామెంట్స్ చేసినా కూడా అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఉర్ఫీ జావెద్.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో ఎదురైన పలు సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా ఉర్ఫీ జావెద్ మాట్లాడుతూ.. తన కుటుంబమే తనను ద్వేషించిందని, ఒక ట్యూబును టాప్ గా ధరించిన ఫోటోలు నా ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాను. కొందరు దాన్ని తీసుకెళ్లి అడల్ట్ సైట్ లో పెట్టారు. దాన్ని ఎలాంటి మార్ఫింగ్ చేయలేదు కాబట్టి చాలామంది అది నేనే అని సులువుగా గుర్తుపట్టారు. అప్పటి నుంచి నన్ను అడల్ట్ స్టార్ అని పిలిచారు. అలా అన్న ప్రతిసారి కూడా నా వీడియో ఏది చూపించండి అని నిలదీసే దాన్ని. నా కన్న తండ్రి నన్ను అడల్ట్ స్టార్ అని ముద్రవేశారు.

అడల్ట్ సైట్ వాళ్ళు మమ్మల్ని 50 లక్షలు అడుగుతున్నారని అందరికీ చెప్పాడు అని తెలిపింది. నా తండ్రి నన్ను చెట్టి దానిని చేసి సింపతి కోరుకున్నాడేమో, మా తండ్రి బంధువులు అందరూ నన్ను దారుణమైన మాటలు అన్నారు. కొన్నిసార్లు చేయి కూడా చేసుకున్నారు అని తెలిపింది ఉర్ఫీ జావెద్. ఇక వాళ్ళ మాటలు అవమానాలు భరించలేక 17 ఏళ్ల వయసులోనే తన చెల్లెల్ని తీసుకొని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కిందట. కానీ అక్కడ కూడా తనకు ఎటువంటి సహాయం జరగకపోవడంతో లక్నో కి వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడి నేడు సెలబ్రిటీ స్థాయికి చేరుకున్నట్లు ఆమె తెలిపింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -