Certificates: కాలేజ్ లో సర్టిఫికెట్లు వెనక్కు ఇవ్వకపోతే చేయాల్సిన పని ఇదే!

Certificates: సాధారణంగా మనం కాలేజీలో చేరిన తర్వాత మన స్టడీస్ కి సంబంధించిన కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ కాలేజీ వారు తీసుకుంటారు అయితే కొన్ని కారణాలవల్ల మనకు ఏదైనా అనారోగ్యం చేసిన లేదంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన మనం కాలేజీకి వెళ్లకుండా ఉన్నప్పటికీ కొందరు కాలేజీ యాజమాన్యం వారికి చెల్లించాల్సిన ఫీజులు పెండింగ్లో ఉంటే వాటిని చెల్లించే వరకు మన సర్టిఫికెట్స్ ఇవ్వమని చెబుతుంటారు.

ఇలా కేవలం కాలేజీలో మాత్రమే కాకుండా మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలలో కూడా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇలా మన స్టడీ సర్టిఫికెట్స్ అన్ని కూడా వర్జినల్ తీసుకుంటారు. ఇలా తీసుకునే సమయంలో వారి మధ్య ఇన్ని సంవత్సరాలు అని ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. అయితే ఆ అగ్రిమెంట్ పూర్తికాకుండానే బయటకు వెళ్తే కనుక సర్టిఫికెట్స్ ఇవ్వరు. ఒకవేళ ఇవ్వాలి అంటే డబ్బు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తుంటారు.

 

ఇలా మనం చదువుకునే చోట, లేదా మనం పని చేసే చోట అయినా అధికారులు మన సర్టిఫికెట్స్ వారి దగ్గర పెట్టుకొని మనల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటే సింపుల్ గా ఈ పద్ధతిని పాటిస్తే చాలు మన సర్టిఫికెట్స్ మనకు వచ్చేస్తాయి.చట్ట ప్రకారం ఏ కంపెనీ అయినా విద్యాసంస్థలు అయినా మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ పెట్టుకోవడం నేరం.ఒకవేళ పెట్టుకున్న వాటిని వెనక్కి తీసుకురావాలంటే ముందుగా మనం ఏ కారణం చేత అయితే అక్కడి నుంచి బయటకు వెళ్తున్నాము దానిని ఒక లెటర్ రూపంలో కాలేజ్ వారికి అందించాలి.

 

మనం ఇలా లెటర్ పెట్టుకున్నప్పటికీ వారు మన సర్టిఫికెట్ ఇవ్వకపోతే మనం ఇదే విషయం గురించి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయవచ్చు. ఇలా పిటిషన్ వేసి చట్టపరంగా మనం ముందుకు వెళితే మన సర్టిఫికెట్స్ తో పాటు… డబ్బులు కూడా మనకు తిరిగి వెనక్కి వస్తాయని లాయర్స్ ఈ విషయం గురించి తెలియజేస్తున్నారు. ఇలా అడ్వకేట్ సహాయంతో మనం హైకోర్టు ద్వారా మన సర్టిఫికెట్స్ మనం చాలా తొందరగా సులభంగా పొందవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -