Akhil Akkineni: అఖిల్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. తప్పు చేయొద్దంటూ?

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి.అక్కినేని నాగేశ్వరరావు నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ఈయన వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నాగార్జున కూడా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య అఖిల్ హీరోలుగా పరిచయమైన విషయం మనకు తెలిసిందే.

నాగచైతన్య సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ సాధించినప్పటికీ అఖిల్ మాత్రం ఇప్పటివరకు ఒక్క సరైన హిట్ కూడా అందుకోలేదు. ఇలా అఖిల్ నటించిన ఐదు సినిమాలు కూడా తనని తీవ్రంగా నిరాశపరిచాయనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇలా అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి గల కారణం తన సినిమా కథల ఎంపిక విషయంలో వేసే తప్పుడు అడుగులనే తెలుస్తుంది.

 

కొద్దిరోజుల క్రితం ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ సినిమాల ఎంపిక విషయంలో నాన్న డెసిషన్ అడగనని అలా అడగటం వల్ల తనపై మరింత భారం పడుతుందన్న ఉద్దేశంతోనే తన సినిమాల ఎంపికను తానే చేసుకుంటానని అఖిల్ చెప్పారు. అయితే ఇలా చేయడమే తన కెరీర్ కు మైనస్ గా మారిందని తెలుస్తుంది. ఇలా సినిమా కథలను సరైన అవగాహన లేకుండా ఎంపిక చేయటం వల్లే అఖిల్ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారని నాగార్జున భావించారట.

 

అఖిల్ ను ఇలాగే వదిలేస్తే తన సినీ కెరీర్ ఇంతటితోనే ముగుస్తుందని భావించిన నాగార్జున అఖిల్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇకపై అఖిల్ చేసే సినిమాలన్ని కూడా నాగార్జున సెలెక్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇలా కథలో మాత్రమే కాకుండా దర్శకులను కూడా నాగార్జున ఎంపిక చేస్తానని తాను సెలెక్ట్ చేసిన సినిమాలలోనే నటించాలని నాగార్జున అఖిల్ కివార్నింగ్ ఇచ్చారని సమాచారం ఇక తనకు తెలియకుండా ఎలాంటి కథలు కూడా వినకూడదని నాగార్జున తన కొడుకుకి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -