Nagarjuna: ఆ సెంటిమెంట్ కోసం పంతం పడుతున్న స్టార్ హీరో నాగార్జున.. ఏం జరిగిందంటే?

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన హీరోగా ఎన్నో సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు అయితే ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలన్నీ కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఈయన చివరిగా ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

ఇక ఈ సినిమా తర్వాత నాగార్జున ఎలాంటి సినిమాలను కూడా ప్రకటించలేదు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా ఈయన నా సామి రంగా అనే సినిమాలో నటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని షూటింగ్ పనులను జరుపుకుంటున్నారు. నాగార్జున ఈ సినిమా షూటింగుకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూటింగ్ పనులలో భాగమయ్యారని తెలుస్తుంది.

ఇక వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి దాదాపు ఆరేడు సినిమాల వరకు విడుదల కానున్నటువంటి తరుణంలో నాగార్జున కూడా తన సినిమాని సంక్రాంతి బరిలోనే దింపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇంత కాంపిటీషన్ నడుమ నాగార్జున ఈ సినిమాని ఎందుకు విడుదల చేయాలనుకుంటున్నారు అంత రిస్క్ ఎందుకు చేస్తున్నారు అనే విషయానికి వస్తే సంక్రాంతి సెంటిమెంట్ అనే కారణంతోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారట.

గతంలో నాగార్జున నటించిన సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇదే సెంటిమెంట్ నా సామి రంగ విషయంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని నాగార్జున తెగ ప్రయత్నాలు చేస్తున్నారని అందుకోసమే ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేయాలని తపన పడుతున్నట్లు తెలుస్తోంది. మరి సంక్రాంతి బరిలో దిగబోయే గుంటూరు కారం, సైంధవ్, రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్ సలాం, శివ కార్తికేయన్ అయలన్ విడుదల అవుతున్నప్పటికీ నాగార్జున కూడా ఈ పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. మరి ఈ సినిమా విషయంలో ఈయన సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా లేదా తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -