Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోపై పెరుగుతున్న వ్యతిరేకత.. నాగార్జున భారీ స్థాయిలో నష్టపోతున్నారా?

Bigg Boss 7 Telugu:  తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే మొదలైన ఈ షో చూస్తుండగానే అప్పుడే ఆరు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని అప్పుడే ఏడవ వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సీజన్ లు ఒక లెక్క ఈ సీజన్ మరొక లెక్క అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి వరుసగా ఆరుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి.

అంతేకాకుండా తాజాగా ఆరో వారం ఎలిమినేషన్స్ లో భాగంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన నయని పావని అనే ఒక స్నానం కనిపిస్తుంది ఎలిమినేట్ కూడా చేశారు. ఆమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి కనీసం 2 వారాలు కూడా కాకముందే అప్పుడే ఆమెను ఎలిమినేట్ చేయడంతో కొందరు బిగ్ బాస్ షో నిర్వాహకులపై మండిపడుతున్నారు. హౌస్ లో అశ్విని, పూజ, తేజ, భోళా లని వదిలేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారా అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. అటు పల్లవి ప్రశాంత్ బయట గట్టి పీఆర్ టీమ్ ని మైంటైన్ చేస్తూ తనని హౌస్ లో విమర్శించే వాళ్ళని ట్రోల్ చెయ్యమని చెప్పినట్టుగా అమర్ దీప్ ని అతని ఫ్యామిలీని పల్లవి పీఆర్ టీమ్ ట్రోల్ చేస్తోంది.

అమరదీప్ తల్లి, భార్యపై పల్లవి ప్రశాంత్ అభిమానులు నీచమైన కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ తన భర్తని తిడుతున్న నాగార్జునపై ఫైర్ అవుతుంది. అలాగే పల్లవి ప్రశాంత్ అభిమానులపై అమర్ దీప్ తల్లి ఫైర్ అవుతున్నారు. మీకు పల్లవి ప్రశాంత్ గొప్ప అయితే మాకేంటి, మమ్మల్ని ఎందుకిలా నీచంగా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడితో ఆపకపోతే నేను హోస్ట్ నాగార్జున గారి దగ్గరకి వెళ్లి కంప్లైంట్ చేస్తాను.

మీ నీచమైన మాటలతో ఎంత బాధపడుతున్నామో మీకేమన్నా తెలుసా అంటూ ఆవిడ ఏడ్చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున కూడా ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యకుండా ఉండాలని నెటిజెన్స్ కోరుకుంటున్నారు. ఈ వీడియోని బట్టి చూస్తుంటే రోజు రోజుకి హౌస్ పై నెటిజన్స్, ప్రేక్షకుల నుంచి నెగిటివిటీ పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఒకవేళ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే హోస్ట్ నాగార్జున చాలా నష్టపోతారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -