Pawan Kalyan: పవన్ కు అన్ని ఇస్తే టీడీపీకి మిగిలేది చిప్పే.. ఏం జరిగిందంటే?

Pawan Kalyan: ఏపీలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం మాటలు పార్టీ నేతలకు అసలు అంతు చిక్కడం లేదు. వచ్చే ఎన్నికలలో ఎలా అయినా సీఎం అవుతాడు అని జనసేన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉండగా ఇటువంటి సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వారందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తాను సీఎం కాలేను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కాళ్యణ్ పార్టీ ఆఫీసులో నేతలతో మాట్లాడిన సందర్భంగా రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయని మరోసారి ప్రకటించారు.

కాగా ఈ ప్రకటన జనసేన నేతల్లో ఉత్సహాన్ని నింపింది. అయితే ఇదే సమయంలో తమ్ముళ్ళను కలవరపాటుకు గురిచేసింది. టీడీపీ, జనసేన పొత్తుంటుందని మాత్రమే పవన్ చెప్పలేదు. బీజేపీని కూడా ఒప్పించి పొత్తులోకి తీసుకొస్తానని గట్టిగా చెప్పడంతో కలవరపాటు మొదలైంది. దీంతో తమ్ముళ్ళల్లో టెన్షన్ మరింత పెరిగిపోతోంది. ఎందుకంటే తమకు బలమున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీచేస్తామని పవన్ చేసిన ప్రకటనే టీడీపీ నేతల్లో టెన్షన్ కు కారణమైంది. కాగా పవన్ లెక్కప్రకారం చూస్తే ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు పార్టీకి మంచి పట్టుందట. ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం ఓటు బ్యాంకు ఉందట. అలాగే కృష్ణా జిల్లా నుండి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలోను 25 శాతం ఓటుబ్యాంకు ఉందన్నారు.

 

రాయలసీమ, కోస్తా జిల్లాలను కూడా కలుపుకుంటే సగటును 18 శాతం ఓటు బ్యాంకు ఉందని తెలిపారు. 2019లో వచ్చిన 7 శాతం ఓటుబ్యాంకు తో పోల్చుకుంటే ఇపుడు తమ పార్టీ ఓటుబ్యాంకు బాగా పెరిగిందని తెలిపారు. అంటే ఉభయగోదావరి జిల్లాల్లో 36 శాతం ఓటుబ్యాంకు ఉందని చెబుతున్న పవన్ రాబోయే ఎన్నికల్లో కనీసం10 సీట్లలో పోటీచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్రలో మరో 8 సీట్లు, రాయలసీమలోని 52 సీట్లు, 10, కోస్తా జిల్లాల్లోని నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మరో 10 సీట్లలో పోటీచేయచ్చని తెలుస్తోంది. అంటే మొత్తం మీద 45 సీట్లలో జనసేన పోటీచేయబోతున్నట్లు పవన్ హింట్ ఇచ్చారు. కాకపోతే సీట్ల సంఖ్యలో కాకుండా ఓట్ల శాతం ద్వారా తెలిపారు. ఇక బీజేపీ కూడా పొత్తులో ఉంటే దానికి మరో 15 సీట్లు వదులుకోక తప్పదు మరి..అంటే పొత్తుల్లో టీడీపీ సుమారు 60 నియోజకవర్గాలను కోల్పోక తప్పదన్నమాట. టీడీపీ కోల్పోయే ఆ 60 నియోజకవర్గాలు ఏవి అన్న విషయం అర్ధంకాక తమ్ముళ్ళల్లో టెన్షన్ మొదలయ్యింది. అయినా పవన్ అడిగనన్ని సీట్లు చంద్రబాబు ఇస్తారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఏదేమైనా జనసేన, బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు సీట్ల కేటాయింపులో కాస్త ఉదారంగా ఉండక తప్పేట్లులేదు. అందుకనే తమ్ముళ్ళల్లో పొత్తుల టెన్షన్ పెరిగిపోతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -