Chandrababu: జనసేనకు దిమ్మతిరిగే షాకిచ్చే దిశగా బాబు అడుగులు పడుతున్నాయా?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికలలో ఎలాగైనా అధికారం చేతిలోపెట్టుకోవాలన్న దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా అధికారంలో రావడానికి తన రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారని తెలుస్తుంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోరాటం చేయలేక పొత్తుకు సిద్ధమయ్యారని కూడా వార్తలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో కలిసి పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికలలో పోటీకి సిద్ధం కాబోతున్నారని త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటించబోతున్నారని కూడా తెలిసింది. అయితే తాజాగా జరిగిన మహానాడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు పొత్తు విషయం గురించి ప్రకటిస్తారని భావించారు. కానీ ఈయన వ్యవహారం చూస్తుంటే మాత్రం ఈసారి ఎన్నికలలో పొత్తుతో కాకుండా ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.

 

పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. ఈ విషయంపై ప్రజలు కూడా పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.మరికొన్ని నెలలలో ఎన్నికలు జరగబోతున్నాయి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా తన సినిమాల పైన దృష్టి పెట్టారు.

 

పవన్ కళ్యాణ్ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించిన దాఖలాలు లేవు అంతేకాకుండా ప్రచార కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదు దీంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై కూడా ఆలోచన చేసి ఆయనతో పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికలలోకి రావాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్న లేకపోయినా తనకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదని భావించిన చంద్రబాబు నాయుడు పవన్ కు షాక్ ఇస్తూ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -