Krishnam Raju First Wife: కృష్ణంరాజు మొదట్లో శ్యామల దేవిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదట!

Krishnam Raju First Wife: సాధారణ నటుడుగా అప్పటి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కృష్ణంరాజు ఆ తర్వాత తెలుగు తెరకు విలన్ గా పరిచయమయ్యాడు. అనంతరం హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలను నిర్మించాడు. అటువంటి వ్యక్తి నిన్న అనగా ఆదివారం కన్నుమూశారు.

ఇక ఈ విషయాన్ని సెలబ్రేటీల నుంచి నార్మల్ పీపుల్స్ వరకు ఎవరు తీసుకోలేకపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో, టీవీల్లో ఈయన వ్యక్తిగత విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. అలా ఇప్పుడు మనం రెబల్ స్టార్ కృష్ణంరాజు మొదటి భార్య ఎవరు? ఆమె ఎలా చనిపోయింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెబల్ స్టార్ కృష్ణంరాజు చనిపోయిన తర్వాత అతడి మొదటి భార్య గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు చాలా హైలైట్ అవుతున్నాయి. కృష్ణంరాజు మొదటి భార్య పేరు సీతాదేవి. ఈమె కృష్ణంరాజుకు వరుసకి మేనకోడలు అవుతుందట.

వీరికి 1969 లో మే 10వ తారీఖున వివాహం జరిగింది. అయితే కొంతకాలం తర్వాత సీతాదేవి అనుకోకుండా 1995లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె ఏదో వ్యక్తిగత పని మీద బయలుదేరుతున్నప్పుడు అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇక సీతాదేవి మరణంతో కృష్ణంరాజు చాలా రోజులకు కృంగిపోయాడు. సీతాదేవి మరణం తర్వాత కృష్ణంరాజు చాలాకాలంగా ఒంటరి జీవితాన్ని గడిపాడు.

ఈ క్రమంలో రెబల్ స్టార్ జీవితం బాగుండాలని తను గతాన్ని తలుచుకుంటూ బాధపడకూడదని రెండవ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారట తన కుటుంబ సభ్యులు. కానీ మొదట కృష్ణంరాజు రెండవ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదట. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇచ్చిన సలహా మేరకు శ్యామలాదేవిని 1996లో వివాహం చేసుకున్నాడు. ఇక వీరిద్దరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. కానీ వీరికి ఇంకా పెళ్లి కాలేదు. కృష్ణంరాజు చనిపోక ముందు ప్రభాస్ తో పాటు వీరి ముగ్గురికి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నారట. కనుక ఈ పెళ్లి బాధ్యత ప్రభాస్ మీద పడినట్లు సినీ ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -