Viral: వైరల్ అవుతున్న ప్రభాస్ పెద్దమ్మ సంచలన వ్యాఖ్యలు!

Viral: దివంగత హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు కృష్ణంరాజు. మంచితనానికి, హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణం రాజు. రీల్ లైఫ్ లో సహాయం అని అడిగిన వారికి లేదనుకుండా సాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు కృష్ణంరాజు. చాలామంది చిన్నారులకు గుండె ఆపరేషన్‌ లు చేయించారు. ఇది ఇలా ఉంటే ఆయన ఇటీవలె మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఇకపోతే మరొక మూడు రోజుల్లో అనగా జనవరి 20 న ఆయన పుట్టినరోజు రాబోతోంది.

ఆయన మన కళ్ళముందు లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా అభిమానులు కృష్ణం రాజును తలుచుకుంటున్నారు. తాజాగా ఆయన సతీమణి శ్యామలా దేవి కృష్ణం రాజుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా శ్యామలా దేవి మాట్లాడుతూ.. నాకు తల్లీ తండ్రీ, గురువు, దైవం, సర్వస్వం అంతా కృష్టం రాజుగారే. నాకు ఆయనే సర్వాంతర్యామి. ఆ శ్యామలాదేవి ఇప్పుడు లేదు. ఆయన జ్ఞాపకార్థంగా నేను మిగిలి ఉన్నాను అంతే. నేను ఆయన జీవితంలోకి ఎలా వచ్చానంటే కృష్టం రాజుగారు ఎన్నో దానధర్మాలు చేస్తారని ఇంట్లో మాట్లాడుకుంటే విన్నాను. అలా ఆయనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అనుకోకుండా మా చుట్టాల ద్వారా తనతో పెళ్లి సంబంధం కుదిరి ఆయన అర్ధాంగిగా మారాను.

 

కానీ అప్పటికే కృష్ణం రాజుకు ఒకసారి పెళ్లయింది. మొదటి భార్య పేరు సీతాదేవి. ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఓసారి చెన్నైలో షాపింగ్‌కు వెళ్తుండగా కారు ప్రమాదంలో ఆమె మరణించింది. ఇది ఆయన జీవితంలో మర్చిపోలేని విషాదం. ఆ బాధ తట్టుకోలేకపోయాడు. ఒంటరివాడు ఆయ్యాడు. ఇది చూసిన కృష్ణం రాజు తండ్రి ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. నా కొడుక్కి అందరి ఆకలి తెలుసు కానీ తన ఆకలి తనకు తెలియదు. అడిగి భోజనం పెట్టేది భార్య మాత్రమే అని రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. సీతాదేవిని ప్రాణంగా ప్రేమించిన ఆయన రెండో పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో మామయ్య ఈయన పెళ్లికి ఒప్పుకునేవరకు భోజనం చేయనని నిరాహార దీక్ష చేశారు. తండ్రి బాధ చూడలేక కృష్ణం రాజు రెండో పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి అమ్మాయి కోసం ఆరా తీయగా నా బంధువులెవరో నా పేరు సూచించారు. కానీ ఇక్కడ మా అమ్మ ఒప్పుకోలేదు. రెండో పెళ్లి.. పిల్లలు కావాలనుకుంటారో, లేదో అని ఎన్నో అనుమానాలతో ఈ సంబంధాన్ని పెద్దగా ఇష్టపడలేదు. అయితే నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఎందుకంటే అప్పటికే తనపై మంచి అభిప్రాయం ఉంది.

 

కాబట్టి పెళ్లికి సిద్ధమయ్యాను. నన్ను బలవంతంగా ఒప్పించారేమోనని కృష్ణంరాజు అనుకున్నారు. అసలు విషయం కనుక్కోమని తన కజిన్‌ను నా దగ్గరకు పంపించగా నేను ఇష్ట పూర్వకంగానే ఒప్పుకున్నానని చెప్పాను. నిజానికి కృష్ణంరాజుకు వారసుడు పుట్టాడు. ఆయన మొదటి భార్యకు ఒక కొడుకు పుట్టి జన్మించాడు. డెలివరీ సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాబు మరణించాడు అని చెప్పుకొచ్చింది శ్యామలాదేవి. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -