Nayanthara-Kasturi: నయనతారకు అసలు ఆ అర్హత లేదు.. వైరల్ అవుతున్న కస్తూరి షాకింగ్ కామెంట్స్!

Nayanthara-Kasturi: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె సినిమాలలో నటించినది చాలా తక్కువ సినిమాలలో అయినప్పటికీ వివాదాల ద్వారా మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కస్తూరి శంకర్ పలు వెబ్ సిరీస్ లలో అలాగే బుల్లితెర సీరియల్స్ లోనూ నటిస్తున్నారు.

ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లోకెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే కస్తూరి శంకర్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోని తాజాగా ఈమె నటి నయన తార గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనమయ్యాయి. నయనతారను దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా అభిమానిస్తూ మాట్లాడుతూ ఆమెకు లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు ఇచ్చారు.

 

అయితే ఈ లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుకు నయనతార అర్హురాలు కాదు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ సూపర్ స్టార్ అయితే ఇండస్ట్రీలో కమల్ హాసన్ విజయ్ అజిత్ వంటి వారు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ సూపర్ స్టార్ అనే బిరుదు రజనీకాంత్ గారికి మాత్రమే ఇస్తారని తెలిపారు.

 

అదేవిధంగా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుకు నయనతార అనర్హురాలని ఇక లేడీస్ సూపర్ స్టార్ అని ఎవరిని ఆ వివరించాలి అనే విషయం గురించి మాట్లాడుతూ ఈ బిరుదు విజయశాంతి గారికి అలాగే కెపి సుందరాంబాల్ వంటి వారు మాత్రమే ఈ బిరుదుకు అర్హురాలు అంటూ కస్తూరి శంకర్ మాట్లాడారు. ఇకపోతే ఈమె ఇదివరకే నయనతార సరోగసి ద్వారా తల్లిగా మారిన సమయంలో కూడా పెద్ద ఎత్తున వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కస్తూరి శంకర్ నయనతార గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -