Nayanthara: యోగి సినిమా సమయంలో ఆ రాజకీయ నాయకుడు నయనతారను వేధించాడా.. ఏమైందంటే?

Nayanthara: తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన నయనతార ప్రస్తుతం హాలీవుడ్ లో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది. అంతేకాకుండా భారీగా పారితోషికాన్ని కూడా అందుకుంటోంది. ఇకపోతే తాజాగా షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది నయనతార. మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.

కాగా నయనతారకి స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తాయట. ఆ రోజుల్లో ఈమె ప్రభాస్ తో కలిసి యోగి లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ ప్రొమోషన్స్ కి వచ్చినప్పుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు నయనతారని లైంగిక వేధింపులకు గురిచేసాడట. నయనతార అవి తట్టుకోలేక ఏడ్చేసిందట. అప్పటి నుండి ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి, ప్రొమోషన్స్ కి పాల్గొనట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో టాక్ ఉంది. యోగి సినిమా సమయానికి ఆమె సౌత్ లో పెద్ద స్టార్.

ఇకపోతే ప్రస్తుతం కోలీవుడ్ లో సినిమాలలో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ దర్శకుడు విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయిన విషయం తెలిసిందే. ఒకవైపు పిల్లల బాధ్యత చూసుకుంటూనే మరొకవైపు హీరోయిన్గా రాణిస్తోంది. కోలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకు పోతోంది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -