Rashmi Gautam: నా దేవుళ్లని తిట్టకండి.. ఏ మతం పర్ఫెక్ట్ గా ఉంది.. రష్మీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

Rashmi Gautam: ఏ ముహూర్తానా ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడారో కానీ అప్పటినుంచి ఆ మాటలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. కొందరు అతనిని సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే మరికొందరు అతనిని తిడుతూ ట్వీట్లు పెడుతున్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి రోగాలతో పోల్చుతూ, సనాతన ధర్మాన్ని శాశ్వతంగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడ్డాయి.

దేశవ్యాప్తంగా ఆ మాటలపై హిందువులందరూ విరుచుపడ్డారు. అతని తల నరికి తీసుకువస్తే 10 కోట్లు ఇస్తానంటూ చేసిన ప్రకటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సినీ నటుడు సత్యరాజ్ వంటివాళ్ళు ఉదయనిధిని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మరికొందరు అతనిని ఎండగట్టేలాగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తెలుగు తెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చదివిన నెటిజన్స్ ఆ కామెంట్ ని ట్రోల్ చేస్తున్నారు దీనిపై రష్మీ కూడా తీవ్రంగానే స్పందించింది.

ఆ వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది రష్మీ.అయితే మన రష్మి కూడా ఏమాత్రం తగ్గకుండా దీటుగా స్పందించి తన నెటిజన్స్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీకు వాక్ స్వతంత్రం, భావ స్వాతంత్రం ఉన్నంత మాత్రాన నా ఇష్టం పై కామెంట్ చేసే హక్కు లేదని, ఎందుకు మీరందరూ దాని గురించి కామెంట్ చేస్తున్నారు అంటూ ప్రశ్నించింది. దేవుడిని పూజించమని గానీ, దేవుడిని ఎందుకు నమ్మరు అని నేను ఎవరిని అడగలేదు.

నాకు నచ్చిన ధర్మాన్ని నేను పాటిస్తే నీకు వచ్చిన సమస్య ఏమిటి అంటూ నిలదీసింది రష్మి . కుల వివక్ష గురించి మాట్లాడుతున్న మీరు అసలు ఏ మతం పర్ఫెక్ట్ గా ఉందో చెప్పగలరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ రష్మీ పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సనాతన ధర్మంపై దూషణలు ఎక్కువయ్యాయి, హిందూ దేవుళ్ళైన అయ్యప్ప, సరస్వతి దేవిని దూషిస్తున్నారు. అన్య మతాల గురించి మాట్లాడని వారికి హిందువుల గురించి మాట్లాడే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటూ నిలదీసిన వీడియోని పోస్ట్ చేసింది రష్మి. ఆ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -