Amala-Rashmi: నెటిజన్ల షాకింగ్ కామెంట్స్.. అప్పుడే బాధ తెలుస్తుందంటూ?

Amala-Rashmi: అంబర్ పేట్ కుక్కల దాడి ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. కుక్కలు దాడి చేసిన ఘటన, ఆ బాలుడి వ్యథను చూసి అంతా చలించిపోయారు. అలా పీక్కుతింటూ ఉన్న విజువల్స్ చూసి అంతా కదిలిపోయారు. కానీ కొంత మంది జంతు ప్రేమికులు మాత్రం కుక్కలపై జాలి చూపించారు. చనిపోయిన బాలుడి గురించి గానీ ఆ కుటుంబం గురించి కానీ కించిత్ బాధను కూడా వ్యక్తం చేయడం లేదు.

 

రష్మీ లాంటి జంతు ప్రేమికులు కుక్కల పట్ల ఎంత ప్రేమను కనబరుస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ సమాజంలో కుక్కలకు కూడా బతికే స్వేచ్చ ఉందని, ఈ ప్రపంచం ఏమీ ఒక్క మానవ జాతిదే కాదన్నారు. కుక్కల వల్లే కాదు.. మేకలు, ఆవుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతుంటాయన్నారు. తాజాగా కుక్కలపై సమాజంలో జరుగుతున్న చర్చలు, జీహెచ్‌ఎంసీకి కుక్కల బెడద మీద వస్తోన్న ఫిర్యాదుల మీద అమల అక్కినేని స్పందించినట్టుంది. పెటా, బ్లూ క్రాస్, జీహెచ్‌ఎంసీలు ఇన్నేళ్లలో చేసిన పనుల గురించి అమల చెప్పుకొచ్చింది.

గత ముప్పై ఏళ్లుగా ఈ సంస్థ దాదాపు ఐదున్నర లక్షల జంతువులకు సాయం అందించింది. అందులో దాదాపు 1.32 లక్షల కుక్కలకు జనాభా నియంత్రణ ఆపరేషన్ చేశాం. రెండు లక్షల కుక్కలకు రేబిస్ వ్యాక్సిన్ వేశాం. వీటి నుంచి ఏ ఒక్క మనిషికి కూడా హాని జరగలేదు. నేను ఆ విషయంలో మీకు మాటిస్తున్నాను. ఈ ముప్పై ఏళ్లలో మేం చేసిన పని వల్ల ఏడు లక్షల వీధి కుక్కలు తగ్గాయని వెల్లడించారు.

 

అయితే అమల, రష్మిపై జనం మండిపడుతున్నారు. అంత పెద్ద ఘటన జరిగినా వీరికి పట్టడం లేదంటూ విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా వీరిద్దరిని కామెంట్లతో ఆడేసుకుంటున్నారు. అక్కినేని అమల, రష్మీ ఇంట్లో కుక్కలను ఉంచాలని అప్పుడే సామాన్యుల బాధ తెలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -