Cows: గోమాతకు వీటిని ఆహారంగా పెడితే ఆ సమస్యలు తొలగిపోతాయట.. ఏం చేయాలంటే?

Cows: హిందువులు ఆవుని గోమాతగా భావించి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. కొందరు ప్రతిరోజు గోమాతను పూజిస్తే కొందరు పండుగ సమయాలలో మాత్రమే పూజిస్తూ ఉంటారు. గోమాతలో సకల దేవుళ్ళు కొలువై ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకటి గోమాతను పూజించడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినిపించడం వల్ల ఎన్నో రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. అక్కడకి కూడా వెళ్లి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు.

ఆవులకి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు. గోవు నుండి వచ్చే ప్రతిదీ కూడా మానవులకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఆవుని పూజించినట్లయితే సమస్త దేవతలందరినీ కూడా పూజించినట్లే. ఆవులకి గడ్డి ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎప్పుడూ గడ్డి మాత్రమే కాకుండా బెల్లంతో చేసిన వంటకాలను, బియ్యంతో చేసిన వంటకాలను కూడా గోమాతకి పెడితే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. వృత్తిలో నిలకడ ఉండాలంటే కచ్చితంగా గోమాతకి నానబెట్టిన ఉలవలు పెట్టాలి. ఆహారం కింద గోమాతకి నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ ఉంటుంది. ధనాభివృద్ధి కోసం నానబెట్టిన బొబ్బర్లని ఆహారంగా గోమాతకి పెట్టాలి. గోధుమలు నానబెట్టి పెడితే కూడా చాలా మంచి జరుగుతుంది.

కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. శనగలను నానబెట్టి గోమాతకి ఆహారం కింద పెడితే ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. బియ్యం పిండి, బెల్లం కొంచెం నీటితో కలిపి గోమాతకి ఆహారం కింద పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. కనుక మానసిక ప్రశాంతతను పొందాలంటే ఇలా ఆహారాన్ని గోమాతకి పెట్టండి, రాగి పిండిలో బెల్లం వేసి, కొంచెం నీళ్లు పోసి గోమాతకు పెడితే దరిద్రం పోతుంది. గోమాతలను కొట్టడం హింసించడం తన్నడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే మహా పాపం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -