Cows: గోవుల కాలి కింది మట్టితో అలా చేస్తే ఆ దోషం తొలగిపోతుంది!

Cows: మనిషి పుట్టుక నుంచే వారి జాతకాలు భవిష్యత్‌ను సూచిస్తాయని చాలా మంది నమ్ముతారు. వారి జాతకాలు, గ్రహాలను బట్టి వారు జీవితంలో ఎదిగే తీరు, అనుభవించే కష్టాలు తెలుస్తాయని కొన్ని శాస్త్రలు, జ్యోతిష్యులు చెబుతుంటారు. కొందరి జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయని వాటిని తొలగించకపోతే అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయంటారు.  అంతేకాక జాతకంలో గ్రహ దోషాలు ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు అనుకున్న పనులన్నీ పెండింగ్‌లో పడుతాయని జోత్యిష్యులు చెబుతుంటారు. జాతకంలో ఉన్న దోషాలను కొన్ని నిబంధనలు పాటించి వాటి బారి నుంచి తప్పించుకోవచ్చని కొన్ని శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడింది.

 

జన్మించిన సమయాన్ని బట్టి మన జాతకంలో ఆయా గ్రహాలు ఉన్న స్థానాన్ని బట్టి మంచి, చెడు ఫలితాలు వస్తాయి. ఎలాంటి దోషాలు ఉన్నా పలు శాస్త్రాలలో చెప్పిన పద్ధతుల ద్వారా తొలగించవచ్చు. గోవు ద్వారా మన నవగ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. గోవులోని అంగాలలో సమస్త దేవతలు ఉంటారు. సప్తఋషులు గోవులో ఉంటారు. గోపాదల్లోనూ ధర్మార్థ కామ మోక్షములు ఉంటాయి. ఆవుకా ళ్లను కడిగి ఆ నీటిని నెత్తిమీద చల్లుకుంటే పాపాలు నశిస్తాయి. అయితే గోవులు సాయంత్రం ఇంటికి వచ్చే సమయాన్ని గోధూళి వేళ అంటారు. ఆ సమయంలో ఎవరైతే గోధూళిలో నిలబడతారో వారికి నవగ్రహ దోషాలు తొలిగిపోతాయి. అంతేకాక గోవుకు నవధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు మొదలైనవి తినిపిస్తే శుభాలు కలుగుతాయి.

గోపూజ, గోదానం, గోసేవ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గోవులు ఇంటికి వచ్చే సమయంలో అవి నడుచుకుంటూ వెళ్లిన తర్వాత గోవు పాదాల కింది మట్టిని తీసుకుని ఇంట్లో ఉంచుకోవాలి. రోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత పొడి భస్మంగా కొంచెం పెట్టుకోవాలి. ఇలా తరచూ పెట్టుకుంటే నవగ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -