Priyamani: ఆంటీ అని కామెంట్ చేసిన నెటిజన్.. ప్రియమణి ఇచ్చిన జవాబు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Priyamani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఇప్పటికే పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో కూడా ప్రియమణి కీలకపాత్రలో నటించి సందడి చేశారు.

ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లతో ప్రియమణి ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రియమణి బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. దీంతో ఈమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే పోస్టుల కారణంగా కొన్నిసార్లు ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ప్రియమణి గ్లామరస్ ఫోటోలు పై చాలా మంది బ్లాక్ ఆంటీ అంటూ కూడా విమర్శలు చేస్తూ ఉంటారు అయితే తాజాగా ఒక నెటిజన్ ఈమెను ఆంటీ అంటూ కామెంట్ చేశారు దీంతో రియాక్ట్ అయినటువంటి ప్రియమణి నేను ఆంటీ ని అయినప్పటికీ చాలా హాట్ ఇక నువ్వు నోరు మూసుకో అంటూ రిప్లై ఇచ్చారు దీంతో ఒక్కసారిగా నెటిజన్ కు దిమ్మతిరిగినట్టు అయింది.

అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ ఆంటీ అనే పదం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం నాకు 35 సంవత్సరాల వయసు రోజురోజుకు వయసు పెరగడం అనేది ఒక ప్రక్రియ నన్ను ఆంటీ అని పిలిచిన ఎలాంటి అభ్యంతరం లేదు వయసు పెరిగితే ఎందుకు సిగ్గుపడాలి. ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆంటీ లేదా అంకుల్ అవ్వాల్సిందే అంటూ ఈ సందర్భంగా ఈ విషయం గురించి ప్రియమణి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -