Navdeep: నవదీప్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు.. ఆ వస్తువును నవదీప్ నుంచి స్వాధీనం చేసుకున్నారా?

Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా A 29 గా ఉన్నటువంటి నటుడు నవదీప్ ను విచారించడానికి నార్కోటిక్ బ్యూరో పోలీసుల కోర్టు అనుమతి తీసుకొని నేడు ఆయనను విచారించారు దాదాపు 6 గంటలపాటు నార్కోటిక్ సభ్యులు ఈయనని వివిధ రకాల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇలా నార్కోటికి పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ దాదాపు 80% నవదీప్ సమాధానాలు చెప్పారని తెలుస్తుంది.

ఈ విధంగా విచారణ అనంతరం ఈయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నార్కోటిక్ వారు చాలా బ్యూటిఫుల్ గా విచారణ చేస్తున్నారని తెలిపారు. ఈయన మూలాల నుంచి కూడా వారు నన్ను విచారణ చేశారని వెల్లడించారు. సుమారు 8 సంవత్సరాల క్రితం ఫోన్ కాల్స్ ఆధారంగా తనని ప్రశ్నలు వేసారని అయితే తాను వాటికి సమాధానాలు చెప్పానని వెల్లడించారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలకంగా మారినటువంటి రామ్ చందర్ పై కూడా ఈయన స్పందించారు. ఈ హైదరాబాదులో నాకు పదివేల మంది తెలుసు.ఈ పదివేల మందిలో రామచందర్ అనే వ్యక్తి కూడా ఒకరని నవదీప్ వెల్లడించారు. ప్రస్తుతానికి నా విచారణ ఈరోజు పూర్తి అయిందని తిరిగి మరి ఎప్పుడు విచారణకి రమ్మని పిలుస్తారో తనకు తెలియదని ఈయన వెల్లడించారు.

ఇక ఈ విచారణ అనంతరం అధికారులు నవదీప్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని తెలుస్తుంది. ఇలా గతంలో ఫోన్ తీసుకొని ఫోన్ కాల్స్ డేటా బయట పెట్టినటువంటి అధికారులు ఈసారి కూడా నవదీప్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారని అలాగే ఈసారి మెసేజ్, డేటా చాటింగ్ డేటాని కూడా తీయబోతున్నారని తెలుస్తుంది.ఇలా వీటన్నింటిని వెలికి తీసిన అనంతరం మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -