Nayanthara: బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి అలాంటి పనులు.. నయన్ కొత్త మూవీ టీజర్ చూస్తే షాకవ్వాల్సిందే?

Nayanthara: స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉంది. పెళ్లి అయినా కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఊపుతో సినిమాలలో నటిస్తోంది. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు నిర్మాతగా సినిమాలను నిర్మిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార నటిస్తున్న చిత్రం అన్నపూర్ణి. ది గాడెస్ ఆఫ్ ఫుడ్ అనేది ట్యాగ్ లైన్.

నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ నాద్ ఎస్ఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో జై హీరోగా నటిస్తుండగా సత్యరాజ్. కేఎస్ రవికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నయన్ 75 వ చిత్రంగా తెరక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదల అయిన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

మరి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి అన్నపూర్ణి. ఇంట్లో మడి, ఆచారాలు ఎక్కువ. కానీ, ఆమెకు మాత్రం చెఫ్ అవ్వాలన్నది కోరిక. నాన్ వెజ్ వంటకాలను తయారుచేసి రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్నది ఆమె డ్రీమ్. అయితే ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఆమె చేసే ప్రయత్నాలు ఏంటి అనేదే ఈ సినిమా కథగా తెలుస్తోంది. నాన్ వెజ్ ను కనీసం చేతితో కూడా ముట్టని కుటుంబంలో పుట్టి ఒక మాస్టర్ చెఫ్ గా అన్నపూర్ణి ఎలా ఎదిగింది అనేది వినోదాత్మకంగా చూపించనున్నాడట నీలేష్. ఇక నయన్ లుక్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలానే అనిపిస్తుంది. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -