Nayanthara: అన్నపూరణి వివాదంపై క్షమాపణలు చెప్పిన నయన్.. ఏమైందంటే?

Nayanthara: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార నటించిన అన్నపూరణి సినిమా వివాదాస్పదం అయిన విషయము అందరికీ తెలిసిందే. ఒక వర్గం ప్రేక్షకులను కించపరిచే విధంగా ఇందులో సన్నివేశాలు చిత్రీకరించారు అంటూ కేసు నమోదు అయింది. దీంతో నిర్మాణ సంస్థ జీ గ్రూప్ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఈ అంశంపై స్పందించింది. తమ ఓటీటీ వేదిక నుంచి అన్నపూరణి సినిమాను తొలిగించింది. ఇదే తాజాగా ఈ వ్యవహారం మొత్తం గురించి హీరోయిన్ నయనతార స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన నోట్ ని కూడా కూడా రాసుకొచ్చింది. గత కొన్ని రోజులుగా నా సినిమా అన్నపూరణి చర్చనీయాంశంగా మారిన విషయంపై బరువెక్కిన హృదయంతో, ఈ ప్రకటన చేస్తున్నాను.

 

అన్నపూరణి చిత్రాన్ని కేవలం వాణిజ్య ప్రయోజనాల కోసమే కాకుండా ప్రజల్లోకి మంచి ఆలోచనను తీసుకురావాలనే ప్రయత్నంగా చేశాము. దృఢ సంకల్పంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చని చూపించేందుకు అన్నపూరణి చిత్రాన్ని రూపొందించాము. మీ మనోభావాలను ఏ విధంగానైనా గాయపరిచి ఉంటే క్షమించండి. అన్నపూరణి సినిమా అసలు ఉద్దేశం ఎవరి మనోభావాలు దెబ్బతీయడం కాదు అని నయనతార తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా తమకు తెలియకుండానే కొందరి మనసుల్ని గాయపరిచామనే విషయాన్ని నయనతార అంగీకరించింది. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా వివాదాస్పదమవ్వడం బాధాకరమన్న నయనతార అన్ని మతాల్ని సమానంగా చూస్తూ, అన్ని ప్రార్థనా స్థలాల్ని సందర్శించే తను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి పని చేయలేదని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -