Varanasi Court: హిందువులకు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి.. ఏమైందంటే?

Varanasi Court: ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఎంతో వివాదాస్పదంగా మారినటువంటి జ్ఞానవాపి మసీదు కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ మసీదులో ఉన్నటువంటి హిందూ దేవత విగ్రహాలకు పూజలు చేసుకోవచ్చు అంటూ కోర్టు నుంచి అనుమతి లభించడంతో హిందువులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ విగ్రహాలు ఉండడంతో వాటికి పూజలు చేయకూడదు అంటూ గతంలో భారీ కేడ్లను ఏర్పాటు చేసి సీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ మసీదులో ఉన్నటువంటి హిందూ దేవత విగ్రహాలకు పూజలు చేయవచ్చు అంటూ తాజాగా వారణాసి కోర్టు అనుమతులను జారీ చేయడంతో ప్రతి ఒక్క హిందువు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడంతో ఇది నిజమైన హిందువుల విజయం అంటూ కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ సంబరం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇలా జ్ఞానవాపి మసీదులో ఉన్నటువంటి విగ్రహాలకు వారంలోగా పూజలు చేయడం ప్రారంభించాలి అంటూ కోర్టు ఉత్తర్వులను వెల్లడించింది. ఈ విషయంలో కోర్టు వెల్లడించిన ఈ తీర్పు చారిత్రాత్మకమైనదని 1983లో అయోధ్య రామ మందిరం తాళాలు తెరవాలంటూ జస్టిస్ కృష్ణమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత జ్ఞానవాపి మసీదులో ఉన్నటువంటి నేలమాలిక తాళాలు తెరవాలి అంటూ కోర్టు ఆదేశాలను జారీ చేశారు. ఈ మసీదులో ఉన్నటువంటి విగ్రహాలకు పూజలు చేయడమే కాకుండా ఈ విగ్రహాలకు విశ్వనాథ్ ఆలయంలోని పూజారులే పూజలు కూడా చేయాలి అంటూ వారణాసి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -