Singer: ఒక్కో డ్రైవర్ కు రూ.82 లక్షలు ఇచ్చిన ప్రముఖ సింగర్.. ఈమె మనస్సు మంచిదంటూ?

Singer: మామూలుగా దగ్గర ఎంతోమంది పనిచేస్తూ ఉంటారు. పర్సనల్ అసిస్టెంట్, క్యాబ్ డ్రైవర్, బాడీగార్డ్స్, మేకప్ మెన్ ఇలా చాలామంది పనిచేస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు వారితో పాటు వారి చుట్టూ ఉన్నవారిని కూడా ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలో మాత్రం పని చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఎక్కువ ఉడుకు అలాంటి వారికి మోసం చేస్తూ ఉంటారు. తాజాగా ఒక సింగర్ తన దగ్గర పని చేసే వ్యక్తికి ఏకంగా లక్షల్లో అమౌంట్ ఇచ్చింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరు? అతనికి ఎంత డబ్బులు ఇచ్చింది అన్న వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ టచ్ ఉన్నవాళ్లకు అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లైవ్ షోలు, ఆల్బమ్ సాంగ్స్ పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే అమెరికాలోని ప్రతి సిటీలోనూ ఈవెంట్స్ చేస్తూ, జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటుంది. అయితే ఈమెకు సంబంధించిన సామాను తిప్పడానికి ప్రత్యేకంగా 50 ట్రక్కులు ఉంటాయి. ఇప్పుడు ఆయా ట్రక్స్ డ్రైవర్లకు తలో లక్ష డాలర్స్ గిఫ్ట్‌గా ఇచ్చింది. అనగా మన ఇండియన్ కరెన్సీ కరెన్సీ ప్రకారం ఈ మొత‍్తం రూ.82 లక్షలు. ఇలా కేవలం తన సామాగ్రిని చాలా జాగ్రత్తగా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తీసుకొస్తున్న డ్రైవర్ల విషయంలో టేలర్ స్విఫ్ట్ గొప్ప మనసు చాటకుంది.

 

వాళ్లందరికీ కలిపి రూ.50 కోట్ల వరకు బోనస్ ఇచ్చింది. శాంటాక్లాజ్‌లో శనివారం ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇకపోతే ఈ సింగర్ నైట్‌లో జరిగే ఒక్కో ఈవెంట్‌కి రూ.100 కోట్ల వరకు సంపాదిస్తుందని టాక్. దీని ద‍్వారా ఆమె ఇప్పటివరకు 1.4 బిలియన్ డాలర్స్ అనగా రూ.94 వేల కోట్లకు పైగా సంపాదించిందని తెలుస్తోంది. ఏదేమైన ఇన్నిన్ని లక్షలు బోనస్ లేదా బహుమతిగా డ్రైవర్లకు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఆమె చేసిన పనికి ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పట్లో అంత డబ్బులు ఇచ్చే సెలబ్రిటీలు ఎవరూ లేరు నిజంగా ఆమె గొప్ప మనసుకి హాట్సాఫ్ అని అంటున్నారు నెటిజన్స్.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -