Ghosts: దెయ్యాలకు భోజనం పెట్టకపోతే ఇబ్బందులు పడుతారట.. నిజమేమిటంటే!

Ghosts: ఒకప్పుడు మూఢనమ్మకాలు చాలా ఉండేవి. టెక్నాలజీ పెరిగే కొద్ది అవి గ్రామీణ ప్రాంతాల వరకే ఉండేవి. ప్రస్తుతం వాటిని అందరూ నమ్ముతున్నారు. ఫలన ప్రాంతంలో దెయ్యం ఉందంటే చాలు ఎంతటి ధైర్యం ఉన్నవాళ్లు కూడా అటు వెళ్లాలంటే జంకుతుంటారు. దెయ్యలు తిరిగే చోటంటే కొన్ని ప్రత్యేక ప్రాంతాలు ఉంటాయి. దెయ్యాలు ఉన్నాయంటే కొందరు నమ్ముతారు.. మరికొందరు నమ్మరు. అయితే దెయ్యాలకు ఆహారం తినిపించే ఒక దేశం కూడా ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనట. దెయ్యాలకు భోజనం పెట్టే కార్యక్రమంలో పదిహేను రోజుల పాటు ఉంటుందట. అసలు దెయ్యాలకు భోజనం ఎందుకు పెడుతున్నారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. అయితే ఇక్కడి దెయ్యాలకు భోజనం పెట్టకపోతే దుష్టశక్తులు, ప్రేతాత్మలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతాయని చెబుతుంటారు. ఇది వాస్తవమా.. అబద్ధామా అని ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

ఆసియా దేశమైన కంబోడియాలో దెయ్యాలకు భోజనం పెట్టే ప్రాంతం ఉంది. ప్రతి సంవత్సరం సెప్టెంబరు, అక్టోబర్‌ మధ్య ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా 15 రోజుల పాటు నరకం తలుపులు తెరుస్తారని కంబోడియాలో బాగా నమ్ముతారు. ఈ ద్వారాలు తెరిచాక దుష్ట ఆత్మలు, దయ్యాలు బయటకు వస్తాయని, అవి ఆకలితో ఉంటాయని చెబుతారు. వాటిని శాంతింపజేసేందుకు వాటికి ఆహారం అందజేస్తారు. ఈ పండుగలో నాలుగు రకాల దయ్యాలు, ఆత్మలు తిరుగాడుతుంటాయంటారు. ఈ ఉత్సవాన్ని ఖైమర్‌ పండుగ అని అంటారు. ఈ పండుగ రోజుల్లో దెయ్యాలు దేవాలయాలు, స్మశానవాటికలు, వారి బంధువుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ మంచి ఆహారం కోసం ఎదురు చూస్తాయని చెబుతారు. ఈ దయ్యాలకు మంచి ఆహారం దొరకకపోతే మనుషులను ఇబ్బంది పెడతాయట. కంబోడియాలోని ప్రజలు నమ్ముతారు.

ఇక్కడి ప్రజలు తమ ఏడుగురు పూర్వీకులకు ఆహారం అందజేస్తారు. పండుగ మొదటి రోజు సూర్యోదయానికి ముందే ఆహారాన్ని సిద్ధం చేస్తారు. దెయ్యాలు కాంతిని ఇష్టపడవనే భావనతో ఉదయాన్నే వాటికి ఆహారాన్ని అందిస్తారు. చిన్నపాటి సూర్యకాంతి కనిపించినా అవి ఆహారం అంగీకరించవని చెబుతారు. దెయ్యాలకు ఆహారం పెట్టనివారు నరకానికి వెళతారని భావిస్తారు. నరకంలోనివారికి దుస్తులు, ఆహారం లభించవని స్థానికులు చెబుతారు. ఉత్సవ సమయంలో బంధువుల ఆత్మలకు ఆహారం అందజేస్తే ఎటువంటి బాధలు ఉండవని అక్కడి ప్రజల్లో ఉన్న నమ్మకంతో ఈ దెయ్యాలకు భోజనం పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -