Jio Fiber: కొత్త కనెక్షన్లు తీసుకుంటే రూ. 6,500 ఆదా!

Jio Fiber: పండుగలు వస్తున్నాయంటే ప్రతి కంపెనీల వారు భారీ ఆఫర్లు ప్రకటిస్తారు. దుస్తులు, వాహనాలు, ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పెడుతారు. ఈ క్రమంలో ఫెస్టివల్‌ సీజన్‌లో జియోఫైబర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా జియోఫైబర్‌ కనెక్షన్‌ తీసుకునే కస్టమర్లకు కోసం ఈ అవకాశం ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద, రూ.6,500 వరకు వౌచర్ల రూపంలో బెనిఫిట్స్‌ పొందవచ్చు. జియోఫైబర్‌ కనెక్షన్‌ కొత్తగా తీసుకోవాలనుకునే వారి కోసం రిలయన్స్‌ జియో అద్భుతమైన బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. డబుల్‌ ఫెస్టివల్‌ బొనాంజా ఆఫర్‌ ను జియో ఫైబర్‌ ప్రకటించింది. ఈనెల 28వ తేదీ వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. రూ.599, రూ.899 జియో ఫైబర్‌ ప్లాన్‌లపై ఆ ఆఫర్లు వర్తిస్తాయి.

రూ.599, రూ.899 ప్లాన్‌లపై జియోఫైబర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ రెండింటిలో ఏదైనా ప్లాన్‌ను ఆరు నెలలు తీసుకుంటే డబుల్‌ ఫెస్టివల్‌ బొనాంజా ఆఫర్‌ వర్తిస్తుంది. రూ.899 ప్లాన్‌ మూడు నెలలకు తీసుకున్నా దీన్ని పొందవచ్చు. ఆరు నెలల ప్లాన్‌లను తీసుకుంటే 15 రోజుల అదనపు వ్యాలిడిటీ దక్కుతుంది. కొత్త కస్టమర్లు జియోఫైబర్‌ రూ.599 ప్లాన్‌ను ఆరునెలల పాటు తీసుకుంటే ఓచర్ల రూపంలో రూ.4,500 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. రూ.1000 విలువైన (ఏజేఐఓ) ఓచర్, రూ.1000 విలువైన రిలయన్స్‌ డిజిటల్‌ ఓచర్, రూ.1000 విలువైన నెట్‌మెడ్స్‌ ఓచర్, ఇక్సిగో రూ.1,000 ఓచర్‌ లభిస్తాయి. వీటితో పాటు ఆరు నెలలకు అదనంగా 15రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. జీఎస్‌టీతో కలిపి ఈ ప్లాన్‌ ఆరు నెలలకు రూ.4,241 (రూ.3,594+ రూ.647 జీఎస్టీ) ఖర్చవుతుంది. ఈ ప్లాన్‌తో 30ఎంబీపీఎస్‌ వేగంతో డేటా వస్తుంది. 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

జియోఫైబర్‌ రూ.899 ప్లాన్‌ను ఆరునెలల పాటు ఎంపిక చేసుకునే కొత్త కస్టమర్లు బొనాంజా ఫెస్టివల్‌ ఆఫర్‌ కింద రూ.6,500 విలువైన ఓచర్లు దక్కించుకోవచ్చు. రూ.2,000 విలువైన (ఏజైఐఓ) రిలయన్స్‌ డిజిటల్‌కు చెందిన రూ.1,000 ఓ చర్, నెట్‌మెండ్స్‌ రూ.500 విలువైన ఓచర్, రూ.3,000 విలువైన ఇక్సిగో ఓ చర్‌ను పొందవచ్చు. 15 రోజుల అదనపు వ్యాలిడిటీ దక్కుతుంది. రూ.899 ప్లాన్‌ను ఆరు నెలల పాటు తీసుకోవాలంటే జీఎస్‌టీతో కలిపి రూ.6,365 అవుతుంది.

రూ.899 ప్లాన్‌ను మూడు నెలల పాటు తీసుకున్నా జియోఫైబర్‌ డబుల్‌ ఫెస్టివల్‌ బొనాంజా ఆఫర్‌ వర్తిస్తుంది. కొత్త కస్టమర్లు రూ.3,500 విలువైన వౌచర్లను పొందవచ్చు. రూ.1000 విలువైన ఏఐజేఓ ఓచర్, రూ.500 విలువైన రిలయన్స్‌ డిజిటల్‌ వౌచర్, రూ.500 నెట్‌మెడ్స్, రూ.1,500 విలువైన ఎక్సిగో వౌచర్‌ లభిస్తాయి. అయితే దీనికి అదనపు వ్యాలిడిటీ ప్రయోజనం ఉండదు. రూ.899 ప్లాన్‌ ద్వారా 100 ఎంబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్, 14 ఓటీటీ యాప్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -