Karimnagar: మరో యువకుడి ప్రాణం తీసుకున్న ప్రేమ వ్యవహారం?

Karimnagar: ఇటీవల కాలంలో చాలామంది యువత ప్రేమ అన్న ఊబిలో కూడుకుపోయి అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.యువతీ యువకులు ప్రేమించుకోగా ఈ ప్రేమ వ్యవహారంలో ఎక్కువగా యువకులే బలవుతున్నారు. ప్రేమించుకున్నారని కుటుంబ సభ్యులు ఎక్కువశాతం మగవారినే చంపేస్తున్నారు. ఈ ప్రేమ వ్యవహారాలకు ఇప్పటికీ ఎన్నో ప్రాణాలు బలైన విషయం తెలిసిందే. యువతి యువకులు ప్రేమించుకున్నారని తల్లిదండ్రులు చేసేదేమీ లేక వారిని చంపడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో బండారి శివ అనే 19 ఏళ్ళ యువకుడు నివసిస్తున్నాడు. శివకి ఎనుగంటి గ్రామానికి చెందిన ఒక యువతితో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారడంతో గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇదే విషయం ఇటీవల యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. అలా కొన్ని రోజుల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఇదిలా ఉంటే ఈ నెల 12న కొరెం గ్రామంలో బీరప్ప జాతర జరిగింది. అక్కడికి ఆ యువతితో శివ కుడా వెళ్లాడు. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు.

ఇదే విషయం యువతి బంధువులకు తెలిసింది. దాంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ అమ్మాయి బంధువులు మాట్లాడాలంటూ శివను తమవెంట తీసుకెళ్లారు. అనంతరం అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అతిగా మద్యం తాగంచారు. అనంతరం దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివ కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ శివ ఆదివారం ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణంతో అతని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలు విలసేలా రోదించారు. మృతుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ మా కుమారుడిని యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -